Site icon HashtagU Telugu

Telangana : తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు.. ఏపీలో సంబ‌రాలు చేసుకున్న కాంగ్రెస్ క్యాడ‌ర్‌

Jai Congress

Jai Congress

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ క్యాడ‌ర్‌లో జోష్ మొద‌లైంది. అరకులోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, డప్పు వాయిద్యాలతో, దిమ్సా నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. ఆదివాసీ కాంగ్రెస్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌, అరకు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పాచి పెంట శాంతకుమారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. దేశంలో మార్పు మొదలైందని, రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఈ సందర్భంగా శాంతకుమారి జోస్యం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 64 సీట్ల‌తో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు ఎమ్మెల్యేల‌తో సమావేశం నిర్వ‌హించి.. సీఎల్పీ నేత‌ను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నేత ఎన్నుకున్న తరువాత సీఎం ప్ర‌మాణ స్వీకారం జ‌ర‌గ‌నుంది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భ‌ట్టి విక్ర‌మార్క రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతుంది. ఈ రోజే సీఎం ప్ర‌మాణ‌స్వీకారం ఉంటుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి.

Also Read:  Andhra Pradesh : ప్రత్తిపాడులో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీలు

Exit mobile version