AP : కాంగ్రెస్ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులు ఖరారు

ఈ సమావేశంలో 117 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలను దాదాపు ఖరారు చేసారు. 58 అసెంబ్లీ, 8 లోక్​సభ స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు

Published By: HashtagU Telugu Desk
Kadapa Sharmila

Kadapa Sharmila

ఏపీ(AP)లో మరో 45 రోజుల్లో అసెంబ్లీ , పార్లమెంట్ (Assembly , Lok sabha Polls) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ (YCP) , కూటమి పార్టీలు (NDA Alliance) తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టాయి. కానీ కాంగ్రెస్ (Congress) పార్టీ ఎంతవరకు అభ్యర్థుల ప్రకటన కానీ ప్రచారం కానీ మొదలుపెట్టకపోయేసరికి ..అసలు పోటీ చేస్తుందా..లేదా ? అని అంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఢిల్లీ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ నిర్వహించారు. అభ్యర్దులు ఎంపికపై చర్చ జరిగింది. ఈ భేటీకి ఎపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, సీనియర్‌ నేత కొప్పుల రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మణికం ఠాగూర్‌ హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సమావేశంలో 117 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలను దాదాపు ఖరారు చేసారు. 58 అసెంబ్లీ, 8 లోక్​సభ స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) బరిలోకి దిగుతుండగా.. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు, విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, కాకినాడ ఎంపీ అభ్యర్థి పళ్లంరాజు, బాపట్ల లోక్‌సభ అభ్యర్థిగా జె.డి.శీలం బరిలో నిలుస్తున్నారు. నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు లోక్‌సభ స్థానాలు మాత్రం పెండింగ్‌లో పెట్టారు. విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఎంపీ స్థానాలు ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీకి దూరంగా ఉండనున్నారు. ఈనెల 9న మరోసారి సీఈసీ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Read Also : AP Volunteers: వైసీపీకి ఈసీ బిగ్ షాక్, తిరుపతిలో 11 మంది వాలంటీర్ల తొలగింపు

  Last Updated: 01 Apr 2024, 04:38 PM IST