Balineni : బాలినేని రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ గుస్సా

స‌ర్వే రిపోర్టుల సారాంశం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప్యాలెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తోంది. ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. ప‌లు శంకుస్తాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో అభివృద్ధి జ‌రిగింద‌ని సంకేతం ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో బుధ‌వారం ప్ర‌కాశం జిల్లాకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లారు.

  • Written By:
  • Publish Date - August 24, 2022 / 11:32 AM IST

స‌ర్వే రిపోర్టుల సారాంశం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప్యాలెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తోంది. ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. ప‌లు శంకుస్తాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో అభివృద్ధి జ‌రిగింద‌ని సంకేతం ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో బుధ‌వారం ప్ర‌కాశం జిల్లాకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బ‌య‌లుదేరి 10.35 గంటలకు చీమకుర్తి చేరుకున్నారు. ఉదయం 10.55 గంటలకు చీమకుర్తి మెయిన్ రోడ్డులోని బూచేపల్లి కల్యాణమండపం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం, బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

సీఎం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మల్లికా గార్గ్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీతో పాటు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవ‌ల వ‌చ్చిన స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం ప్ర‌కాశం జిల్లా అంత‌టా వైసీపీ వెనుక‌బ‌డింద‌ని పార్టీలోని అంతర్గ‌త చ‌ర్చ‌. ప్ర‌త్యేకించి ద‌ర్శి, గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి బాగాలేద‌ని తెలుస్తోంది.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి చేతుల్లో నుంచి ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయం జారిపోయింద‌ని ఆయ‌న వ‌ర్గీయుల్లోని టాక్‌. ఆయ‌న ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలోనూ స‌ర్వేల ప్ర‌కారం బాగా వెనుక‌బ‌డ్డార‌ని స‌మాచారం. అందుకే, ఆయ‌న్ను రెండోసారి మంత్రిగా కొన‌సాగించ‌కుండా జగ‌న్ జాగ్ర‌త్త్త ప‌డ్డార‌ట‌. ఆయ‌న మీద ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌ల‌ను టీడీపీ చేస్తోంది. ఇప్ప‌టికే మ‌నీల్యాండ‌రింగ్ కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా ఆయ‌న అనుచ‌రులు డ‌బ్బుతో ప‌ట్టుబ‌డ్డారు. అంతేకాదు, వైఎస్ కుటుంబం ఆయ‌న్ను ప్ర‌స్తుతం విశ్వాసంలోకి తీసుకోవ‌డంలేద‌ని తెలుస్తోంది.

వైఎస్ కుటుంబానికి ఆయ‌న ర‌క్త సంబంధీకుడు కాదు. దూరపు బంధువు. అయిన‌ప్ప‌టికీ ద‌గ్గ‌ర బంధువు మాదిరిగా ఫోక‌స్ అయ్యారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డికి ఆయ‌న స‌మీప బంధువు. ఆయ‌న ద్వారా దూర‌పు బంధుత్వం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబంతో ఉంది. అందుకే, ఆయ‌న‌కు కొంత కాలం పాటు స్వేచ్ఛ‌ను ఇచ్చారు. కానీ, ఆయ‌న వియ్యంకుడు చేసిన కొన్ని ప‌నులు కార‌ణంగా వైఎస్ కుటుంబానికి బాలినేని దూరం అయ్యార‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని టాక్. మొత్తం మీద ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాన్ని స‌మీక్షించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అస‌హ‌నంగా ఉన్నార‌ని తెలుస్తోంది. పైగా ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న సురేష్ కు బాలినేని ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డాన్ని కూడా సీరియ‌స్ గా తీసుకున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను దూరంగా పెట్టినా. ఆశ్చ‌ర్యంలేద‌ని కొన్ని వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అంతేకాదు, జ‌న‌సేన పార్టీ వైపు బాలినేని చూస్తున్నార‌ని ఇటీవ‌ల వ‌చ్చిన ప్ర‌చారం. వాట‌న్నింటినీ గ‌మ‌నిస్తోన్న జ‌గ‌న్ ఎక్క‌డ ఏమి చేయాలో అలా చేయ‌డానికి సిద్ధం అయ్యార‌ని తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా జ‌గ‌న్ టూర్లో బాలినేనికి సీఎం ఇచ్చే. ప్రాధాన్యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ ప‌ర్య‌ట‌న ఎలా జ‌రుగుతుందో చూడాలి.