AP: YSR చేయూత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి..!!

ఏపీ సర్కార్ 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త చెప్పింది. శుక్రవారం వారి ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 07:08 AM IST

ఏపీ సర్కార్ 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త చెప్పింది. శుక్రవారం వారి ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజక వర్గం నుంచి ఈ నగదు విడుదల కార్యక్రమం జరగనుంది. అయితే ఈ జాబితలో మీ పేరు ఉందో లేదో ఈవిధంగా చెక్ చేసుకోవచ్చు. YSRచేయూత పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాగా రేపు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు సీఎం జగన్. అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత కింద నిధులను రిలీజ్ చేస్తారు జగన్. అక్కడ నిర్వహించే బహిరంగ సభలోనూ సీఎం జగన్ ప్రసంగిస్తారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో 45 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సున్న అర్హులకు సర్కార్..ఈ పథకం పేరుతో ప్రతిఏటా 18,750చొప్పున నాలుగు విడతల్లో రూ. 75వేలు అందిస్తోంది.శుక్రవారం మూడో విడత నగదును రిలీజ్ చేయనున్నారు. అయితే వైఎస్సార్ చేయూత పథకంలో తమ పేరు ఉదో లేదో చేసుకోవాలి అంటే…ఎన్బీఏం పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ లాగిన్ అయితే తెలుసుకోవడం కష్టం అనుకునేవాళ్లు…దగ్గర లోఉన్న గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. స్థానిక వాలంటీర్ దగ్గర కూడా ఈ లిస్టు ఉంటుంది.

అన్ని విధాల అర్హులై…వైఎస్సార్ చేయూత జమ కాలేదు అంటే ఆందోళన పడాల్సి అవసరం లేదు. 48 గంటల తర్వాత సచివాలయానికి వెళ్లి…మీరు కూడా అర్హులు అని నిరూపించే ఆధారాలు చూపిస్తే సరిపోతుంది. నిజమైన అర్హులు అని తేలితే వారికి నగదు అందేలా ఏర్పాట్లు చేస్తారు.