World Tribal Day 2023: ఆదివాసీల‌కు పోడు భూముల‌పై హ‌క్కులు కల్పించాం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివాసీలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

World Tribal Day 2023: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివాసీలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ఎంత అభివృద్ధి చెందుతున్నా, సమాజం ఎంత ముందుకెళ్లినా ఆదివాసీలు మాత్రం తల్లి లాంటి అడవిని వదలడం లేదని అన్నారు సీఎం జగన్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా వారు అడ‌వుల‌పైనే ఆధారప‌డి జీవిస్తూ.. నిత్యం ప్ర‌కృతిని కాపాడుతున్నారని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వివిధ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెట్టామని అన్నారు. ‌నాణ్య‌మైన విద్య‌, వైద్యం వంటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తూనే ల‌క్ష‌ల మంది గిరిజ‌నుల‌కు పోడు భూముల‌పై యాజ‌మాన్య హ‌క్కులు క‌ల్పించామని పేర్కొన్నారు. గిరిజ‌నుల‌కు ప్రాధాన్యత ఇచ్చి, కొత్త‌గా రెండు జిల్లాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆదివాసీలకు వైఎస్ జగన్ శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

Also Read: Nandamuri Natasimham: నిర్మాతల హీరో బాలయ్య బాబునే.. ఎందుకో తెలుసా!