Why A.P. Needs Jagan : మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలి..?

ప్ర‌తి ఇంటికీ సంక్షేమాన్ని అందించిన‌ప్పుడు వై నాట్ 175, ప్ర‌జ‌ల‌కు ఇన్ని మంచి ప‌నులు చేసిన‌ప్పుడు వై నాట్ 175 అని జగన్ అన్నారు

Published By: HashtagU Telugu Desk
'why A.p. Needs Jagan'

'why A.p. Needs Jagan'

మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలి..? అనేదానికి ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం వైసీపీ చేయబోతుంది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ (Why A.P. Needs Jagan) అనే కార్యక్రమం ద్వారా..రాష్ట్ర ప్రజలకు మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలో చెప్పబోతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు తెలియజేయాలని సీఎం జగన్ ఈ ప్రోగ్రాం తలపెట్టారు.

YCP పరాధికారుల సమావేశం సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగన్ (CM Jagan) మాట్లాడుతూ..ప్ర‌తి ఇంటికీ సంక్షేమాన్ని అందించిన‌ప్పుడు వై నాట్ 175, ప్ర‌జ‌ల‌కు ఇన్ని మంచి ప‌నులు చేసిన‌ప్పుడు వై నాట్ 175 అని జగన్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు మంచి చేసేందుకు జగన్ కావాలని అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడదామని పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

గత 53 నెలలుగా సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు, రాష్ట్రానికీ చేసిన మంచిని, ప్రతిపక్షాల విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టే విధంగా జగన్..పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాని ఆయన అన్నారు. అంతేకాక మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులను తీసుకొచ్చామని, అధికారాన్ని ప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నామని సీఎం తెలిపారు. వైఎస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడాని నిరూపించుకున్నాను, సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్వాయం చేశామని, రూ.2 లక్షల 35 వేల కోట్లను డీబీటీ ద్వారా అందించామని సీఎం జగన్ తెలిపారు.

నామినేటేడ్ పదవుల్లో 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామని, అదే విధంగా స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయం చేశామని సీఎం పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరగొచ్చాని, మన లక్ష్యం క్లీన్ స్వీప్ చేయడమే అని నాయకులను ఉద్దేశించి సీఎం జగన్ అన్నారు. ఇక ‘రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం. పేదవాడి పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒక వైపు.. పెత్తందారు మరోవైపు. పేదవాళ్లు మొత్తం ఏకం కావాలి. అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమ‌న్నారు. ‘ఫిబ్రవరిలో వైయ‌స్ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళదాం. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుదాం. వైసీపీ శ్రేణులంతా గ్రామస్థాయి నుంచే మమేకమవ్వాలి. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాల‌ని పిలుపునిచ్చారు.

Read Also : Telangana Congress : కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి..ఢిల్లీ కి పొంగులేటి

  Last Updated: 09 Oct 2023, 02:20 PM IST