AP housing Scheme: పనులు వేగవంతం చేయండి… గృహనిర్మాణ శాఖ సమీక్షలో సీఎం జగన్‌

గృహనిర్మాణ శాఖపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సమీక్ష నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 09:38 PM IST

గృహనిర్మాణ శాఖపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సమీక్ష నిర్వహించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధానత్య ఇవ్వాలని, గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం అన్నారు. ఇప్పటికే చేసిన పనులకు నిధులు కూడా సక్రమంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

నూతన కాలనీల్లో నీళ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పన చురుగ్గా చేపట్టాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. కాలనీల్లో పనుల ప్రగతి సందేహాల నివృత్తికి ప్రత్యేకించి ఒక పోన్‌ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. విశాఖపట్నంలో ఇటీవల పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలపై అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. విశాఖలో 1 లక్ష 24 వేల ఇళ్ల నిర్మాణ పనులకు అన్నిరకాలుగా సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్టోబరు చివరినాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని అధికారులు తెలియజేయగా, వీలైనంత త్వరగా నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం జగన్ అధికారులను ప్రశ్నించగా, 1.4 లక్షల ఇళ్లు సర్వం సిద్ధం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సూచించారు. 90 రోజుల్లో ఇంటిపట్టా కార్యక్రమం సీఎం జగన్ సమీక్ష నిర్వహించగా.. వచ్చిన దరఖాస్తుల్లో 2,03,920 మందిని కొత్తగా అర్హులుగా తేల్చినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వీరిలో ఇప్పటికే లక్షమందికి పట్టాలు అందించామని అధికారులు వివరించగా, మిగతావారికీ పట్టాలు త్వరిత గతిన అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు సీఎం జగన్ ఆదేశించారు.