Jagan Meets Modi:మోడీకి జగన్ సమస్యల వినతి

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి జగన్ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై జగన్‌ ప్రధానితో చర్చించారు.

Published By: HashtagU Telugu Desk
Jagan and Modi

Jagan and Modi

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి జగన్ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై జగన్‌ ప్రధానితో చర్చించారు.
విభజన హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరినట్లు సమాచారం. పోలవరం, జల వివాదాలకు సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధానమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సిందియా
ను కలిశారు. భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలంటూ ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు.భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత వ్యవధి (3 ఏళ్లు)లో పూర్తి చేసే విధంగా సహాయ, సహకారాలు అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు.
సీఎం జగన్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఏపీ ఆర్థిక పరిస్థితి ని వివరించారు. రేపు జలశక్తి మంత్రిని కలవనున్నారు.

  Last Updated: 03 Jan 2022, 09:59 PM IST