Site icon HashtagU Telugu

CM JAGAN : మూడు రాజధానులపై కీలక ప్రకటన..!!

Jagan Plenary

Jagan Plenary

స్వాతంత్య్ర దినోవత్స ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. మా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు.

రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రికరణే మా విధామని జగన్ పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి సమతౌల్యాన్నికి ఇదే పునాది అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అన్నారు. ప్రపంచంతో పోటీపడుతూ ప్రగతి సాధిస్తున్నాం. ప్రపంచ ఫార్మారంగంలో భారత్ మొదటిస్థానంలో ఉందన్నారు సీఎం జగన్.