AP CM: అరుదైన ఘనత సాధించిన ఏపీ సీఎం జగన్…పురాతన ఆలయాన్ని సందర్శించిన తొలి సీఎం..!!

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Jagan

Jagan

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుదైన ఘనత సాధించినట్లుగా రికార్డుల్లోకి ఎక్కారు. 1000ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తిరుపతి గంగమ్మ పురాతన ఆలయాన్ని సందర్శించిన తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి చెల్లె అయిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. పురాతన కాలం నుంచి తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించిన తర్వాతే…శ్రీవారికి దర్శనానికి భక్తులు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయ దర్శనం సుమారు 400ఏళ్ల పూర్వం నుంచే ఉంది. అయితే ప్రస్తుత సాంప్రదాయ పరిస్థితుల్లో అక్కడి ఆలయంలో అమలకు నోచుకోకపోవడం…ఈ విషయాన్ని సీఎం జగన్ కు తిరుపతి ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే ఆ సంప్రదాయాన్ని ఆచరించేందుకు సీఎం జగన్ మొగ్గు చూపారు. మంగళవారం సాయంత్రం తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాక ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

 

  Last Updated: 28 Sep 2022, 06:57 AM IST