Site icon HashtagU Telugu

Konaseema Tour: రేపు లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన

Jagan Surveh Helicopter

Jagan Surveh Helicopter

కోనసీమను కుదిపేసిన గోదావరి వరద ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుంది. దాదాపు 100కు పైగా గ్రామాలు గోదావరి ముంపు బారిన పడ్డాయి. అనేక చోట్ల కాజువేలు కొట్టుకుపోయాయి. వరద సమయంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారులు విస్తృతంగా సేవలందించారు.

ముంపు బాధితులు ఇబ్బందులు పడకుండా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపుథ్యంలో ముంపు బాధ్యత ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం గంటి పెదపూడి వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుండి ఏటిగట్టు మీదుగా గోదావరి పాయలు దాటేందుకు పంట్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9.40కి తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం పదిన్నరకు గంటి పెదపూడి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గంటి పెందపూడి ఫెర్రీ పాయింట్‌కు చేరుకుంటారు. ఫెర్రీలో ప్రయాణించనున్న సీఎం ముంపు గ్రామాలను సందర్శిస్తారు. అక్కడ వరద బాధితులను పరామర్శించనున్నారు సీఎం. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరిగెలవారిపేట, ఊడుమూడిలంక గ్రామాలకు చేరుకోనున్నారు. ఈ గ్రామాల్లో ముందు బాధితులతో మాడ్లనున్న సీఎం మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా ఫెర్రీ పాయింట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.గంటా 45 నిమిషాలకు గంటి పెదపూడి హెలీప్యాడ్ నుంచి పి.గన్నవరం మండలం వడ్రేవుపల్లి గ్రామానికి బయలుదేరతారు. అక్కడి ముంపు బాధితులను పరామర్శించనున్న సీఎం తర్వాత రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 2.40 కి రాజోలు మండలం మేకపాలెం వెళతారు. అక్కడి బాధితులతో మాట్లాడిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా వడ్రేవుపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుని రాజమండ్రి బయలుదేరతారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు రాజమండ్రి చేరుకున్న అనంతరం అధికారులతో సమావేశం కానున్నారు. రాత్రికి రాజమండ్రి ఆర్‌ అండ్ బీ గెస్ట్ హౌస్‌లోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులు సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి హామీ ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు. కాగా వరద బాధితులను పరామర్శించడంతో పాటు జిల్లాలో దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలిస్తారు. వరద నష్టాన్ని అంచనా వేసి తయారుచేసే నివేదికను సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి అందజేసి సాయం కోరనున్నారు.

Exit mobile version