CM Jagan: విశాఖ నుంచే పరిపాలన : ఏపీ సీఎం జగన్

పాలనా రాజధాని విశాఖ అని సీఎం జగన్ ప్రకటించారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుందన్నారు.

  • Written By:
  • Updated On - March 3, 2023 / 02:21 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీఐఎస్ లో కీలక ప్రకటన చేశారు. పాలనా రాజధాని విశాఖ అని సీఎం జగన్ ప్రకటించారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుందన్నారు. త్వరలోనే ఇది సాకారమవుతుందన్నారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు 340మంది ఇన్వెస్టర్లు వచ్చారన్నారు. రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. 6లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకం కానుందన్నారు.

“విశాఖలో ఇన్వెస్టర్స్ సుమ్మిట్ జరగడం గర్వంగా ఉంది. ఏపీకి 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 6 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇవాళ 8.54 లక్షల MOUలు ఇవాళ జరుగుతాయి. మిగతా ఎంవోయూలు రేపు జరుగుతాయని” సీఎం జగన్ పేర్కొన్నారు. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు విశాఖ నెలవు. ఇండియాలోనే ఏపీ అతి కీలకమైన రాష్ట్రం. ఆరు రేవులు రాష్రమంతటా విస్తరించి ఉన్నాయని అన్నారు.

అలాగే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని. త్వరలోనే విశాఖ నుండి పాలన సాగిస్తామని..త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని సీఎం వ్యాఖ్యానించారు. మీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్థలం విశాఖ. అలాగే జీ20 సదస్సుకు విశాఖ వేదికగా మారబోతుంది. అనేక రకాల వనరులు విశాఖలో ఉన్నాయని సీఎం అన్నారు. కాగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా మరోసారి ఏపీ రాజధాని విశాఖే అని పునరుద్ఘాటించారు.

Also Read: Governor and CS: తెలంగాణ సీఎస్‌పై తమిళిసై సీరియస్!