తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కు పెంచుతూ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీతో 809 కొత్త వైద్య చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అంకితభావంతో అమలు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎంప్యానెల్డ్ ఆసుపత్రులపై నమ్మకం, విశ్వాసం ఉందని, ఇప్పుడు రోగులకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని, 104 కాల్ సెంటర్ ద్వారా ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలను కూడా అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఆరోగ్యశ్రీ కింద అందజేసే సేవలపై ఎంప్యానెల్డ్, విలేజ్ క్లినిక్‌లు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారంతో కూడిన బుక్‌లెట్లను కూడా ఇస్తున్నారు. ఆసుపత్రులు అందిస్తున్న సేవల వివరాలను కూడా ఇందులో ఉంచినట్లు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వారు గాయపడితే వెంటనే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్ర, సేవా రత్న, ఆరోగ్య సేవా అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సలను ప్రారంభించిన సీఎం.
ఆరోగ్య శ్రీ కింద 3,255కి చేరిన వైద్య చికిత్సలు. కొత్తగా 809 చికిత్సలు పెంపు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1059 నుంచి 3,255కు పెంపు. pic.twitter.com/C1QFoCEp2Y— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 28, 2022