AP CM JAGAN : విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయండి..!!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రతి క్లాసులోనూ డిజిటల్ బోధనకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

  • Written By:
  • Publish Date - July 22, 2022 / 06:48 PM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రతి క్లాసులోనూ డిజిటల్ బోధనకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటరాక్టివ్ డిస్ ప్లే లేదా ప్రొజెక్టర్లతో ప్రభుత్వ బడిపిల్లలకు మరింత విజ్జానం పెరుగుతుందన్న జగన్…ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ, ఎంఈఓ సహా పలు స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఎస్ సీఈఆర్టీ, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీపైనా ద్రుష్టి పెట్టాలని పేర్కొన్నారు.

ఒక రెండో దశ నాడు-నేడు పనులను వేగవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందు భద్రత ద్రుష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచని చేయాలని…టాయిలెట్ మెయిన్టెన్స్, స్కూల్ మెయిన్టెన్స్ ఫండ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జగన్ తెలిపారు. పీపీ 1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు, మూడో తరగతి ఆపైనా ప్రొజెక్టర్లు పెట్టేలా ఆలోచన చేయాలని తెలిపారు.