పర్యాటకాన్ని పరుగులు పెట్టించండి : ఏపీ సీఎం జగన్

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు.

  • Written By:
  • Publish Date - October 28, 2021 / 11:08 AM IST

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు. గత ప్రభుత్వ హాయంలో పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించారు. గత రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎలాంటి టూరిజం కార్యక్రమాలు జరగడం లేదు.రాష్ట్రంలో టూరిజంకి కేంద్రంగా ఉన్న బోటింగ్ సైతం ఆగిపోయింది. 2019 సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం జరిగింది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు బోటింగ్ను నిలిపివేశారు. అయితే తాజాగా నవంబర్ 7వ తేదీన నుంచి పాపికొండలకు బోట్లు నడిపేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. ఇప్పటి వరకు టూరిజం ద్వారా పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో టూరిజం ప్రాజెక్టులు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చూడాలని, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆధునిక సౌకర్యాల లభ్యత వల్ల పర్యాటకం మెరుగుపడుతుందని, ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని , పర్యాటక రంగంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడిన ప్రజలకు మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విశాఖపట్నంలో లండన్-1 తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వివిధ కంపెనీలు వివిధ పర్యాటక ప్రాజెక్టులపై రూ.2868.6 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్పై కనీసం రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటూ 48,000 మందికి ఉపాధి కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,564 కొత్త టూరిజం గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని వివిధ కంపెనీలు ప్రకటించాయి. ఒబెరాయ్ కంపెనీ విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంకలో ఒబెరాయ్ విలాస్ పేరుతో రిసార్ట్లను ఏర్పాటు చేయనుంది. హయత్ గ్రూప్ విశాఖపట్నంలోని శిల్పారామంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించనుంది. తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖపట్నంలో మరో హోటల్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్ రానుంది. విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం, స్కై టవర్ నిర్మాణం, విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్, జ్ఞానగిరి, అనంతపురం జిల్లా పెనుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.