CM Jagan: రాష్ట్రపతి ఎన్నికలతో జగన్ వైఖరి తేలిపోతుందా? బీజేపీకి అనుకూలమా? కాదా?

ఏపీ సీఎం జగన్ కు ఈ మూడేళ్ల అధికారపర్వంలో అసలు అగ్ని పరీక్షలే ఎదురుకాలేదా అంటే.. అయ్యాయి.. కానీ కరోనా మాయలో అన్నింటినీ దాటేశారు.

  • Written By:
  • Updated On - May 3, 2022 / 12:21 PM IST

ఏపీ సీఎం జగన్ కు ఈ మూడేళ్ల అధికారపర్వంలో అసలు అగ్ని పరీక్షలే ఎదురుకాలేదా అంటే.. అయ్యాయి.. కానీ కరోనా మాయలో అన్నింటినీ దాటేశారు. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము బలపరిచిన అభ్యర్థే ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. కానీ ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే మాత్రం కమలానికి భంగపాటు తప్పదు. మరి ఇంతటి కీలకమైన ఎన్నికల్లో జగన్ వైఖరి ఏమిటి? ఎవరికి మద్దతిస్తారు?

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కావల్సినంత మద్దతు లేదు. కానీ దానికోసం ఏదైనా ఒక పార్టీ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ప్రాంతీయ పార్టీల్లో అలాంటిది ఏది ఉందా అని చూస్తే.. తెలంగాణలో పవర్ లో ఉన్న టీఆర్ఎస్, ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్, ఏపీలో పవర్ లో ఉన్న వైసీపీ ఉన్నాయి. వీటిలో టీఆర్ఎస్ ఎలాగూ కమలాన్ని సపోర్ట్ చేసే సీన్ లేదు. ఎందుకంటే రెండు పార్టీల మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా ఉంది.

టీఆర్ఎస్ కాకపోతే ఇక మిగిలింది… బిజూ జనతాదళ్, వైసీపీ. బీజేడీ ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తుందా లేదా చెప్పలేం. ఇక మిగిలింది వైసీపీ. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీకి అన్ని విషయాల్లోనూ మరో మాట లేకుండా మద్దతిస్తూనే వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కాని వైసీపీ కమలాన్ని సపోర్ట్ చేస్తే.. అది టీడీపీకి ఆయుధంగా మారుతుంది. మరి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.