Jagan Tabs: జగన్ ‘డిజిటల్’ కానుక.. విద్యార్థులకు 5.18 లక్షల ట్యాబ్స్ పంపిణీ!

ఏపీ సీఎం (AP CM) జగన్ రెడ్డి పాఠశాల విద్యార్థుల చదువులను మరింత మెరుగుపర్చేందుకు పాటుపడుతున్నారు.

  • Written By:
  • Updated On - December 23, 2022 / 03:40 PM IST

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల చదువు (Study)ను మరింత మెరుగుపరచడానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan) రూ. 688 కోట్ల విలువైన 5.18 లక్షల ట్యాబ్ లను పంపిణీ చేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను జరుపుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 4,59,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) మాట్లాడుతూ “మారుతున్న తరానికి అనుగుణంగా సమాజంలోని కొన్ని వర్గాలు మారడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ ప్రభుత్వం డిజిటల్ (Digital) విప్లవానికి తీసుకొస్తోందని జగన్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో సమగ్ర విధానం ద్వారా విద్యావ్యవస్థను మెరుగుపరచాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. పిల్లలకు మంచి మేనమామగా, ఆ తల్లులకు అన్నయ్యగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రపంచంలోని దేశాల మధ్య అసమానతలు ఉన్నట్లే, రాష్ట్రాల తలసరి ఆదాయంలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఉన్నాయి. రాష్ట్రంలోని (Andhra pradesh) వర్గాల మధ్య ఇలాంటి అంతరాలు ఉన్నాయి’’ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

పిల్లలకి నాణ్యమైన విద్య హక్కు ఉంది. ఇందులో ఆంగ్లం (English Medium) కూడా నేర్చుకునే హక్కు ఉంటుంది. అయితే, మా పిల్లల విషయానికి వస్తే, ఇంగ్లీషు మీడియం వైపు వెళ్లడాన్ని ఇతర పార్టీలు వ్యతిరేకిస్తూ కోర్టు కేసులు వేయడం దురదృష్టకరం. పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును ప్రవేశపెట్టడంతోపాటు తరగతి గదుల్లో ‘సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్’ను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రంలో విద్యావ్యవస్థను మార్చడంలో ప్రభుత్వం ముందుంది’’ అని జగన్ (CM Jagan) అన్నారు.

Also Read: The Truths of Osho: ఓషో ‘జీవిత’ సత్యాలు.. ఆయన మాటల్లో కొన్ని!