ఏపీ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరంలో ‘ఇంట్లో ఆనందం, ప్రతి కుటుంబంలో అభివృద్ధి వెలుగులు నింపాలని’ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ఇల్లు సంతోషం మరియు ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని.. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ అన్నారు. 2023లో ఏపీ ప్రజలు వ్యక్తిగతంగా నరకాన్ని చవిచూశారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. ”నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. కోటి ఆశలు మన సంప్రదాయం, చేదు జ్ఞాపకాలు మన మనస్సులోకి ఎప్పటికీ రాకూడదని తాము ఎల్లప్పుడూ ఆశిస్తున్నామన్నారు. అసమర్థ వ్యక్తికి అధికారం దక్కే అవకాశం ఇచ్చినప్పుడు రాష్ట్రం ఎలా నష్టపోయిందో మనందరికీ అనుభవంలోకి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని తెలిపారు. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ చంద్రబాబు ఆకాంక్షించారు. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024 లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపుదామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: YSRCP : ప్లీజ్ ఒక్కసారి సీఎం అపాయిట్‌మెంట్ ఇప్పించండి.. వైసీపీలో జిల్లా అధ్యక్షుడు ఆవేదన
జనసేన పార్టీ అధినేత కె.పవన్‌కల్యాణ్ తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.. గత అనుభవాలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్రానికి ఒక మలుపుగా, ప్రగతికి నాంది పలకాలన్నారు. ప్రజా నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని.. 2024వ సంవత్సరం అందరికీ కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని తెస్తుందని ఆశిస్తున్నానని పవన్ తెలిపారు.