Site icon HashtagU Telugu

Chandrababu Arrest: జగన్ కక్ష్యపూరిత యాటిట్యూడ్: బాలయ్య

Chandrababu Arrest

New Web Story Copy 2023 09 09t172504.960

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం దారుణమైన చర్యగా వర్ణించారు బాలయ్య. ముఖ్యమంత్రి జగన్ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారని బాలకృష్ణ ఆరోపించారు.

జగన్ ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. 16 నెలలు జైలులో ఉన్న జగన్ చంద్రబాబును కూడా జైలుకు పంపాలని అనుకుంటున్నాడని మండిపడ్డారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రత్యేకించి సరైన ఆధారాలు లేవని బాలకృష్ణ చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై ఆరోపణలు కేవలం ప్రచారం మాత్రమేనని, ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని ఆయన అన్నారు. డిసెంబర్ 19, 2021 న ఎఫ్ఐఆర్ నమోదు చేయబడినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని సందేహించాడు బాలయ్య.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందగా, 72,000 మంది విద్యార్థులకు ఉపాధి కల్పించామని ఈ నేపథ్యంలో దీని స్కామ్‌గా తీసుకోలేమని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బాలయ్య లేవనెత్తాడు. జగన్ బెదిరింపులకు ఎవరూ భయపడరని, న్యాయం కోసం ప్రజా కోర్టులో తేల్చుకుంటామని నందమూరి బాలకృష్ణ అన్నారు.కాగా బాలకృష్ణ చంద్రబాబు వియ్యంకులు అన్న విషయం తెలిసిందే.

Also Read: CBN Vote for Note Advocate : చంద్ర‌బాబు కేసు వాదించే అడ్వ‌కేట్ లూథ్రా ఎవ‌రు?