Site icon HashtagU Telugu

CM Jagan: ఉద్యోగుల‌కు జ‌గ‌న్ బంప‌రాఫ‌ర్‌

ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి వైద్యం సేవ‌ల‌ను పొందే అవ‌కాశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్యోగుల‌కు క‌ల్పిస్తూ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంతో ఇక నుంచి హైద‌రాబాద్ , చెన్నైలోని ఆస్ప‌త్రులు ఏపీ రోగులు నిండిపోనున్నారు. ప్ర‌త్యేకించి ఉద్యోగులు జ‌గ‌న్ ఇచ్చిన బంప‌రాఫర్ వాళ్ల‌ను సంతోష‌పెడుతోంది.

రాష్ట్రంలోని ఉద్యోగులకు వర్తింపజేయని 565 చికిత్సలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు వెల్ల‌డించారు. ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులు పొందిన సేవల బిల్లుల్ని ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్ స్కీమ్ తో చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డుల సమన్వయానికి ఆరోగ్యమిత్రలకు ఆదేశాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఉద్యోగసంఘాలతో మంత్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్ మెంట్ స్కీం ను మరో ఏడాది పాటు పొడిగేంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్ర‌స్తుతం ఉద్యోగులకు ఆరోగ్య సేవల్ని ఈహెచ్ఎస్ కార్డులతో ప్ర‌భుత్వం అందిస్తోంది. ఆరోగ్యశ్రీ తరహాలో అందిస్తున్న ఈ సేవల ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు సేవ‌లు అందిస్తున్నారు. వాటిని రాబోవు రోజుల్లో ఆరోగ్యశ్రీ త‌ర‌హాలో ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. .