Site icon HashtagU Telugu

CM Jagan: ఏపీలో డిగ్రీ కోర్సులకు 10 నెలల ఇంటర్న్ షిప్ తప్పనిసరి…సీఎం జగన్..!!

Ys Jagan Mohan Reddy Video Con 1200x768 Imresizer

Ys Jagan Mohan Reddy Video Con 1200x768 Imresizer

గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఉన్నత విద్యాశాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇంటర్న్‌షిప్‌లు మూడు దశల్లో ఉండాలని, మొదటి సంవత్సరం 2 నెలలు, రెండవ సంవత్సరం 2 నెలలు, తృతీయ సంవత్సరం 6 నెలలు ఉండాలని సమావేశంలో సీఎం వ్యాఖ్యానించారు. విద్యాశాఖలో సర్కార్ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు, వాటి అమలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో చర్చించారు.

విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్..!
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామని అన్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇస్తున్నామని. ప్రతి మూడు నెలలకు ఒక సారి డబ్బు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యా కోర్సులు ఉద్యోగాలు, అందించేలా ఉండాలని, ప్రస్తుతం ఉన్న కోర్సులకు సప్లిమెంటరీ కోర్సులు, ప్రత్యేక కోర్సులను జోడించాలని ఆయన అన్నారు.

విద్యార్థులు ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించాలి..!
“కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడానికి విద్యార్థులకు GRE, GMAT లాంటి పరీక్షలకు హాజరయ్యేలా, ఉత్తమ శిక్షణ అందేలా విద్యార్థులు ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించాలి” అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.ఒకే బిడ్డకు మాత్రమే పరిమితమైన కుటుంబంలోని పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలు వర్తిస్తాయని, బాలికలు అబ్బాయిలందరికీ విద్యనందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి..!
కర్నూల్, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించగా వెనుకబడిన ప్రాంతాల్లో బాలికలు చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగైదు కళాశాలలను ఎంచుకుని దేశంలోనే అత్యుత్తమ కళాశాలలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.