Site icon HashtagU Telugu

AP CM candidate : BJP, JSP ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా పురంధ‌రేశ్వ‌రి?

Ap Cm Candidate

Ap Cm Candidate

తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూట‌మి (AP CM candidate )క‌డుతున్నాయా? ఆ దిశ‌గా అడుగులు పడుతున్నాయా? అంటే ఇతిమిద్ధంగా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈనెల 18వ తేదీన మోడీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఎన్డీయే కూట‌మి స‌మావేశం త‌రువాత ఆ మూడు పార్టీల కూట‌మిపై క్లారిటీ రానుంది. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పోయిన టీడీపీ, అకాళీద‌ల్ త‌దిత‌ర పార్టీలను ద‌గ్గ‌ర‌కు తీసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అందుకు సంబంధించిన సంకేతాలు ఏమీలేవ‌ని టీడీపీ చెబుతోంది. ఎలాంటి ఇన్విటేష‌న్ ఎన్డీయే మీటింగ్‌కు హాజ‌రు కావాల‌ని అంద‌లేద‌ని టీడీపీ చెబుతోంది.

ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పోయిన టీడీపీ, అకాళీద‌ల్ త‌దిత‌ర పార్టీలను ద‌గ్గ‌ర‌కు తీసుకునే ప్ర‌య‌త్నం (AP CM candidate )

ఏపీ, తెలంగాణ బీజేపీ పార్టీల‌ను ప్ర‌క్షాళ‌న చేసిన త‌రువాత పొత్తుల‌పై పలు ర‌కాల ఊహాగానాల‌కు తావిస్తోంది. వాస్త‌వంగా తెలంగాణ‌లో కింగ్‌, ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని బీజేపీ ల‌క్ష్యం. ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. అందుకే, కిష‌న్ రెడ్డి, పురంధ‌రేశ్వ‌రికి తెలంగాణ‌, ఏపీ విభాగం బీజేపీ బాధ్య‌త‌ల‌ను అప్పగించారు. సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా చూస్తే, కాంగ్రెస్ ఓటు బ్యాంకును భారీగా చీల్చ‌డానికి కిష‌న్ రెడ్డి నాయ‌క‌త్వం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫ‌లితంగా కాంగ్రెస్ బ‌ల‌హీన‌పడే అవ‌కాశం ఉంది. ప‌రోక్షంగా బీఆర్ఎస్ కు లాభిస్తోంది. ఇక ఏపీలో పురంధ‌రేశ్వ‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోయే ప్ర‌మాదం ఉంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చరిష్మాతో న‌డిచే టీడీపీకి రాబోది గ‌డ్డుకాలం. పురంధ‌రేశ్వరి రూపంలో (AP CM candidate ) భారీగా టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోయే అకాశం లేక‌పోలేదు. అదే, జ‌రిగితే మ‌రోసారి వైసీపీ అధికారంలోకి రావ‌డానికి ఆస్కారం ఉంది.

సీఎం అభ్య‌ర్థిగా పురంధేశ్వ‌రిని నిల‌ప‌డానికి బీజేపీ మాస్ట‌ర్ స్కెచ్

తెలంగాణ‌లో కింగ్ కావాలంటే టీడీపీతో పొత్తుకు బీజేపీ వెళ్లాలి. అప్పుడు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును భారీగా చీల్చుకోవ‌డం ద్వారా బీజేపీ లాభ‌ప‌డ‌నుంది. ఒక వేళ అన్ని ర‌కాలుగా క‌లిసొస్తే, తెలంగాణ‌లో కింగ్ కావ‌డానికి అవ‌కాశం ఉంది. ఇక ఏపీలో జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా వెళ్ల‌డం ద్వారా మూడో శ‌క్తిగా ఎద‌గాల‌ని ప్ర‌యత్నం చేస్తోంది. అందుకే, పురంధ‌రేశ్వ‌రిని ఏపీ చీఫ్ గా నియ‌మించింది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అయితే, సీఎం అభ్య‌ర్థిగా పురంధేశ్వ‌రిని (AP CM candidate ) నిల‌ప‌డానికి బీజేపీ మాస్ట‌ర్ స్కెచ్ వేసింది. అటు బీజేపీ ఇటు టీడీపీ పార్టీల‌కు ఆమోద యోగ్య‌మైన మ‌హిళగా ఆమె ఉన్నారు. ఆ దిశ‌గా వ్యూహాలు ర‌చిస్తోన్న బీజేపీ ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని చూస్తోంది.

Also Read : AP Trend : BJP కి షాక్‌,కామ్రేడ్ల‌తో TDP,JSP కూట‌మి?

ఈనెల 18వ తేదీన ఢిల్లీలో జ‌రిగే ఎన్డీయే కూట‌మి స‌మావేశానికి టీడీపీ హాజ‌రు కానుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ రోజు జ‌రిగే మీటింగ్ లో టీడీపీ హాజ‌రయితే బీజేపీ, జ‌న‌సేన , టీడీపీ కూట‌మిగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ‌తాయ‌ని భావించాలి. లేదంటే, రాబోవు ఎన్నిక‌ల్లో ఏపీలో ముక్కోణ‌పు పోటీ త‌ప్ప‌దు. జ‌నసేన , బీజేపీ కూట‌మిగా వెళ‌తాయ‌ని తెలుస్తోంది. క‌మ్మూనిస్ట్ ల‌తో క‌లిసి చంద్ర‌బాబు, ఒంటిరిగా వైసీపీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది. అప్పుడు కింగ్ మేక‌ర్ కావాల‌ని ఎప్ప‌టి నుంచే ఏపీ బీజేపీ కంటోన్న క‌ల నెర‌వేరుతుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే, పురంధ‌రేశ్వరిని ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత సీఎం అభ్య‌ర్థిగా (AP CM candidate )ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Also Read : AP BJP : మాజీ మంత్రి కొడాలి నాని జైలుకే.. BJP కండీష‌న్స్ అప్లై..!