AP Civil Supplies – 825 Staff Posts : 8వతరగతి పాసైన వాళ్లకూ ఛాన్స్.. ఏపీ పౌర సరఫరాల శాఖలో 825 జాబ్స్‌

AP Civil Supplies - 825 Staff Posts : ఆంధ్రప్రదేశ్ లో  825 కాంట్రాక్టు బేసిస్ జాబ్స్ అవకాశం ఇది.

  • Written By:
  • Updated On - August 26, 2023 / 09:06 AM IST

AP Civil Supplies – 825 Staff Posts :  ఆంధ్రప్రదేశ్ లో  825 కాంట్రాక్టు బేసిస్ జాబ్స్ అవకాశం ఇది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కాకినాడలోని ఏపీ సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ జిల్లా కార్యాలయం విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన 825 మంది సిబ్బందిని భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటిలో టెక్నికల్‌ పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి.  పూర్తి వివరాలకు https://eastgodavari.ap.gov.in/  వెబ్‌సైట్‌ ను చూడొచ్చు.

Also read : Benefits of Drinking Water: బ్రష్ చేయకుండానే నీరు తాగుతున్నారా.. అయితే ప్రయోజనాలు ఇవే..!

మొత్తం ఖాళీలు : 825

  • టెక్నికల్ అసిస్టెంట్: 275 పోస్టులు
  • అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 275 పోస్టులు
  • అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
  • హెల్పర్: 275 పోస్టులు
  • అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

Also read : Saudi Arabia Students: సౌదీ అరేబియాలో పిల్లలు బడికి వెళ్లకుంటే.. తల్లిదండ్రులు జైలుకే..!

దరఖాస్తు విధానం.. ఎంపిక విధానం..

  • వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు.. హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్‌ సప్లయ్స్‌ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ చిరునామాకు పంపాలి.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 2, 2023