Site icon HashtagU Telugu

AP CID : రోజా ఇక జైలుకు వెళ్లాల్సిందేనా..?

Roja Cid

Roja Cid

వైసీపీ ప్రభుత్వం (YCP Govt)లో రోజా (Ex Minister Roja) ఆడిందే ఆట..పాడిందే పాట..వేసేందే చిందు అన్నట్లు సాగింది. నగరి ప్రజలు ఆమెకు ఎమ్మెల్యే పదవి అప్పగించిన..జగన్ మిస్టర్ పదవి కట్టబెట్టిన ఆమె ప్రజలకు చేసింది ఏమి లేదు. పైగా వచ్చిన నిధులను స్వాహా చేయడమే కాదు..నియోజకవర్గంలో ఏ షాప్ ప్రారంభమైన..ఏది జరిగిన ఆమెకు కమిషన్ వెళ్లాల్సిందే. ఆలా కమిషన్లు నొక్కేస్తూ..నిధులు నొక్కేస్తూ భారీగా ఆస్తులు వెనకేసుకుంది. ఇక ఇప్పుడు కూటమి సర్కార్..ఆ నొక్కినా నిధులను బయటకు కక్కించే పనిలో పడ్డారు. మొదటి నుండి రోజా తీరు ఫై ఆగ్రహం గా ఉన్న బాబు..సమయం చూసి కొట్టాలని చూసాడు. ఇక ఇప్పుడు ఆ సమయం రావడం తో CID ని రంగంలోకి దింపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆడుదాం ఆంధ్ర (Aadudam Andhra) పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు రోజా ఫై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కబడ్జీ నేషనల్ మాజీ ప్లేయర్ ఆర్వీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ వెంటనే విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించారు. ఈమెతో పాటు మరో మాజీ మంత్రి కృష్ణదాస్ ఫై కూడా పిర్యాదు అందడంతో ఇద్దర్ని విచారించాలని ఆదేశాలు జారీ చేసారు.

ఇదే జరిగితే.. రోజా, కృష్ణదాస్‌లు కూడా విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది.ఇక, ఇప్పటికే జోగి రమేష్ టీడీపీ అధినేత ఇంటిపై దాడి కేసులోను, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌, నందిగం సురేష్ వంటివారు కేసులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కేసులో చిక్కుకుని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు రోజా , ధర్మానల వంతు వచ్చిందన్న చర్చ సాగుతోంది.

Read Also : Silent Brain Strokes: సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? దాని ల‌క్ష‌ణాలివే..!