Site icon HashtagU Telugu

AP CID : ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఐడీ బృందం.. మ‌రికాసేప‌ట్లో నారా లోకేష్‌కి నోటీసులు

Lokesh Cid

Lokesh Cid

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ బృదం ఢిల్లీ చేరుకుంది. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో ఇటీవ‌ల నారా లోకేష్‌ని ఏ14గా సీఐడీ చేర్చింది. అయితే ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని లోకేష్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. అయితే హైకోర్టులో లోకేష్‌కి ఊర‌ట ల‌భించింది. అక్టోబ‌ర్ 3వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని.. 41 ఏ నోటీసులు ఇచ్చి విచారించాల‌ని సీఐడీకి హైకోర్టు సూచించింది. అయితే నోటీసులు ఇచ్చేందు సీఐడీ బృందం ఢిల్లీ వెళ్లింది. గ‌త 16 రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాజ‌మండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్న నేప‌థ్యంలో లోకేష్ ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో చ‌ర్చిస్తున్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిష‌న్ కూడా వాయిదా ప‌డింది. ఇటు చంద్ర‌బాబు రిమాండ్ కూడా అక్టోబ‌ర్ 5వ‌ర‌కు పొడిగించ‌డంతో లోకేష్ ఢిల్లీలోనే ఉండి న్యాయ‌ప‌రంగా ఎలాంటి పోరాటం చేయాలో స‌ల‌హాలు తీస‌కుంటున్నారు.

ఇన్న‌ర్ రింగ్‌రోడ్డు, ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో అవినీతి జ‌రిగిందంటూ నారా లోకేష్‌ని కూడా అరెస్ట్ చేయించాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం చూస్తుంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో నిందితులు నారాయణ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎం/ఎస్ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎం/ఎస్ హెరిటేజ్ ఫుడ్స్ మరియు ఇతరులకు ల‌బ్ధి చేకూరింద‌ని ప్ర‌భుత్వం ఆరోపింస్తుంది.. అమరావతి IRR అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడానికి తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేశార‌ని సీఐడీ పేర్కొంది.