టీడీపీ శ్రేణులకు మరో షాక్ ఇచ్చింది CID . అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amaravati Inner Ring Road Case)లో A14గా నారా లోకేష్ (Nara Lokesh) ను చేర్చుతూ..ACB కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి నారాయణ (Narayana)పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌ను దక్షిణం వైపున మార్చి లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు.
మరోపక్క ఇదే కేసులో A1గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు మొదలవుతాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు లోకేష్ పేరును చేర్చి టీడీపీ శ్రేణులకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబును బెయిల్‌పై బయటకు రప్పించేందుకు తరచూ న్యాయవాదులతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్‌ను సైతం అరెస్ట్ చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో లోకేష్‌ను నిందితుడి చేర్చడం ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
Read Also : Silver Medal: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం.. సెయిలింగ్ ఈవెంట్‌లో రజతం
కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు..దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ చంద్రచూడ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రం వరకు తెలియనుంది.