Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబును వదలని సీఐడీ..మరోకేసు నమోదు

TDP

AP CID files fresh case against Chandrababu

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను ఏపీ CID వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే చంద్రబాబు ఫై పలు కేసులు నమోదు చేసిన CID ..తాజాగా మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతిలిచ్చారన్న (Illegal Permissions) ఆరోపణలపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలకు అనుమతులు ఇచ్చారని ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌(FIR)లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఏసీబీ న్యాయస్థానం (ACB Court) జడ్జికి అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు 2014 నుండి 2019 మధ్యలో సీఎం గా ఉన్న సమయంలో ఏకంగా ఏడు డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. ఆయన పాలనలో ఐదేళ్ల కాలంలో 254 బ్రాండ్లకు అనుమతి నిచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త కొత్త మార్పులు చేశారు చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీ లకు గాను ఏకంగా 14 డిస్టిలరీ లకు అనుమతిని ఇచ్చారని, మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారు అన్న కారణంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై CID అధికారులు కేసు నమోదు చేశారు.

ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదిలా ఉండగానే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసులకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా మద్యం అనుమతుల కేసులో ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరోమారు చంద్రబాబు ని అరెస్ట్ చేయడానికి CID అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Read Also : KTR-Revanth : డ్రామారావు..డ్రామాలు ఆపాలంటూ రేవంత్ ఫైర్