CBN Kuppam Tour : చంద్ర‌బాబు కుప్పం టూర్ పై ‘సీఐడీ’

మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం కుప్పం వెళ్లిన టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు క‌ద‌లిక‌ల‌పై పోలీస్ నిఘా పెట్టింది. ఏ క్ష‌ణ‌మైన ఆయ‌న‌కు నోటీసులు జారీ చేస్తార‌ని టాక్ న‌డుస్తోంది. అ

  • Written By:
  • Updated On - May 12, 2022 / 05:09 PM IST

మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం కుప్పం వెళ్లిన టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు క‌ద‌లిక‌ల‌పై పోలీస్ నిఘా పెట్టింది. ఏ క్ష‌ణ‌మైన ఆయ‌న‌కు నోటీసులు జారీ చేస్తార‌ని టాక్ న‌డుస్తోంది. అమ‌రావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్ విష‌యంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసిన విష‌యం విదిత‌మే. ఆ కేసుకు సంబంధించి ఏ1 గా చంద్ర‌బాబు, ఏ2గా నారాయ‌ణ‌, ఏ3గా లింగ‌మ‌నేని ర‌మేష్ ల‌తో పాటు 12 మంది పేర్ల‌ను చేర్చారు. వాళ్లంతా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు కావ‌డంతో అరెస్ట్ ల‌పై ఆచితూచి సీఐడీ పోలీస్ వ్య‌వ‌హ‌రిస్తోంది.

రెండో రోజులుగా ప్ర‌త్యేక సీఐడీ బృందం హైద‌రాబాద్ లోనే మ‌కాం వేసింద‌ని తెలుస్తోంది. మరో బృందం కుప్పంలో ప‌ర్య‌టిస్తోన్న చంద్ర‌బాబు క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తుంద‌ని స‌మాచారం. ఏ క్ష‌ణ‌మైన ఆయ‌న‌కు నోటీసులు అంద‌చేసే అవ‌కాశం ఉంద‌ని వినికిడి. సాధార‌ణంగా గ‌తంలోని అరెస్ట్ ల‌ను చూస్తే ఏపీ సీఐడీ , ఏసీబీ పోలీసులు అరెస్ట్ ల కోసం శుక్ర‌వారం ముహూర్తం పెట్టుకున్నారు. ఫ్రైడే రోజున‌ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల‌ను అరెస్ట్ చేసిన ఆన‌వాళ్లు ఉన్నాయి. ఆ క్ర‌మంలో మాజీ సీఎం చంద్ర‌బాబుకు కూడా శుక్ర‌వారం అరెస్ట్ ప్ర‌మాదం పొంచి ఉంద‌ని వైసీపీ వ‌ర్గాల్లోని టాక్‌. అమ‌రావ‌తి రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో మిగిలిన పారిశ్రామిక వేత్త‌ల‌ను అరెస్ట్ చేస్తార‌ని స‌మాచారం. తొలి నుంచి లింగ‌మ‌నేని ర‌మేష్ మీద ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ స‌ర్కార్ నిఘా పెట్టింది. ఆయ‌నకు క‌ర‌క‌ట్ట మీద ఉన్న ఇంటిని కూల్చివేయ‌డానికి అప్ప‌ట్లో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేసింది. అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించ‌డానికి తొలుత ప్ర‌జావేదిక భ‌వనాన్ని కూల్చి వేసిన విష‌యం విదిత‌మే. ఆ త‌రువాత క‌ర‌క‌ట్ట‌పై ఉన్న నిర్మాణాల య‌జ‌మానులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో ఆ గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.

ప్ర‌స్తుతం క‌ర‌కట్ట మీద ఉన్న లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ లోనే చంద్ర‌బాబు నివాసం ఉంటున్నారు. అమ‌రావ‌తి ప్రాంతంలోని ఉండ‌వ‌ల్లి వ‌ద్ద లింగ‌మ‌నేని ఎస్టేట్ ఉంది. అదే, చంద్ర‌బాబు నివాసం కూడా కావ‌డంతో సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే కూల్చివేయాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌తో నిమ్మ‌కుండిపోయారు. ఇప్పుడు తాజాగా లింగ‌మ‌నేని ర‌మేష్ పైన జ‌గ‌న్ స‌ర్కార్ నిఘా పెట్టింది. ఆయన‌తో పాటు చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా నిర్వ‌హించిన పారిశ్రామిక స‌ద‌స్సుల్లో చురుగ్గా పాల్గొన్న 13 మంది పారిశ్రామిక‌, వ్యాపార వేత్త‌లు అమ‌రావ‌తి రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో ఉన్నారు. వాళ్ల‌ను అరెస్ట్ చేసే ప్ర‌క్రియ‌కు ఏపీ సీఐడీ క‌స‌ర‌త్తు చేస్తోంది.

ఏ1 గా ఉన్న చంద్ర‌బాబును ముందుగా ఏపీ సీఐడీ అరెస్ట్ చేస్తుందా? అంటే కుప్పం కేంద్రంగా జ‌రుగుతోన్న ఆప‌రేష‌న్ గ‌మ‌నిస్తే నిజం కావ‌డానికి అవ‌కాశం ఉంద‌ని భావించొచ్చు. ఒక వైపు హైద‌రాబాద్ ఇంకో వైపు కుప్పం కేంద్రంగా చేసుకుని సీఐడీ బృందాలు చేస్తోన్న రెక్కీ వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. దీంతో చంద్ర‌బాబు అరెస్ట్ మీద ఊహాగానాల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా న్యూస్ వైర‌ల్ అవుతోంది. మూడు రోజుల చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న శుక్ర‌వారంతో ముగిస్తుంది. ఆ లోపుగా ఏదో ఒక నిర్ణ‌యాన్ని సీఐడీ చేస్తుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు వేసే ఎత్తుగ‌డ‌లు ఏముంటాయో చూడాలి.