AP CID : వివేక హ‌త్యపై సీబీఐ విచార‌ణ వేళ అమ‌రావ‌తి పై `సీఐడీ` హ‌ల్ చ‌ల్‌

అమ‌రావ‌తి భూముల కొనుగోలు, బినామీలు, ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ను నిరూపించ‌డానికి

  • Written By:
  • Updated On - February 25, 2023 / 05:18 PM IST

అమ‌రావ‌తి భూముల కొనుగోలు, బినామీలు, ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ త‌దిత‌ర అంశాల‌ను చాలా కాలంగా వైసీపీ వినిపిస్తోంది. వాటిని నిరూపించ‌డానికి నానా తంటాలు ప‌డుతోంది. ఇప్పుడు ఏపీ సీఐడీ(AP CID) మాజీ మంత్రి నారాయ‌ణ రెండో కుమార్తె చేసిన మ‌నీ రూటింగ్ (Money rooting)అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొస్తోంది. సరిగ్గా వివేకా హ‌త్య కేసు విచార‌ణ కోసం ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ పిలిచిన రోజు ఏపీ సీఐడీ సోదాల‌ను మొదలు పెట్టింది. రెండో రోజు అవినాష్ రెడ్డి తండ్రి భాస్క‌ర్ రెడ్డిని విచారిస్తోన్న వేళ ఏపీ సీఐడీ నారాయ‌ణ కుమార్తె నివాసాల్లో త‌నిఖీల‌ను కొన‌సాగిస్తోంది. ఇదంతా కేవ‌లం ఇష్యూ డైవ‌ర్ట్ చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న ప్ర‌య‌త్నంగా టీడీపీ భావిస్తోంది.

మాజీ మంత్రి నారాయ‌ణ రెండో కుమార్తె చేసిన మ‌నీ రూటింగ్ (AP CID)

సీఆర్డీయే వ్య‌వ‌హారాల‌ను అన్నీతానై ఆనాడు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నారాయ‌ణ ప‌ర్య‌వేక్షించారు. అక్క‌డ జ‌రిగిన ప్ర‌తి అంశమూ ఆయ‌న‌కు తెలుసు. ఆయ‌న మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం కేసులు న‌మోదు చేసింది. కోర్టులో ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కూడా పొందారు. ఇప్పుడు ఆయ‌న రెండో కుమార్తె నుంచి అమ‌రావ‌తి భూముల కొనుగోలు కోసం ఎలా డ‌బ్బు వ‌చ్చింది? అనేదానిపై ఏపీ సీఐడీ (AP CID) కూపీలాగుతున్నారు. హైదరాబాద్‌, మాదాపూర్, కొండాపూర్ ల‌లో ఉన్న శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల శుక్ర‌వారం త‌నిఖీలు నిర్వ‌హించారు. మనీ రూటింగ్‌కు(Money rooting) పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించార‌ట‌. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

 Also Read : AP CID: ఏపీ సీఐడీకి భంగ‌పాటు

భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలన్నింటీపై కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ మేర‌కు మాజీ మంత్రి నారాయణ నివాసాలపై కూడా ఇటీవ‌ల‌ సీఐడీ(AP CID) అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఈసారి నారాయణ రెండో కుమార్తె నివాసంలోనూ చేస్తున్నారు.

అమరావతి భూముల కొనుగోలు  అవకతవకలు

అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న అభియోగాలతో గతంలో ఈ కేసును సీఐడీకి (AP CID) బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో పలువురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత పలువురి నివాసాల్లో సోదాలు చేశారు. నారాయణ కూతురిపై ఆరోపణలు వస్తున్న క్ర‌మంలో ఆమె నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఐడీ అధికారులు సోదాలు కొనసాగించారు. శ‌నివారం కూడా సీఐడీ సోదాల‌ను నిర్వ‌హిస్తోంది.

నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ సోదాలు

ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఏపీ సీఐడీ(AP CID) సోదాలు కంటిన్యూగా జ‌రుగుతున్నాయి. కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసం సోదాలపై శుక్రవారం సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకలపైనే సోదాలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు సోదాలు చేస్తూనే ఉన్నారు. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ సోదాలు నిర్వహించాయి. నారాయణ కుటుంబీకుల బ్యాంక్ స్టేట్ మెంట్లను సీఐడీ అధికారులు పరిశీలించారు. పలు లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద రెండు రోజుల సోదాల త‌రువాత మ‌నీ రూటింగ్ అంటూ సీఐడీ చెబుతోన్న కొత్త ఇన్విస్టిగేష‌న్. అంద‌రికీ మ‌నీ లాండరింగ్ తెలుసుగానీ, కొత్త‌గా ఏపీ సీఐడీ మ‌నీ రూటింగ్ ను తెలుసుకుంది.

Also Read : AP CID: అంతులేని అరెస్ట్ ల ప‌ర్వం! మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు జ‌ల‌క్‌!

గ‌త మూడున్న‌రేళ్లుగా అమ‌రావ‌తి భూముల కొనుగోలు విష‌యంలో సీఐడీ(AP CID) విచార‌ణ జ‌రుగుతూనే ఉంది. ఒక్క‌రిని కూడా దోషులుగా నిరూపించ‌లేక‌పోయింది. ఇంకా దాన్ని ప‌ట్టుకుని వేలాడుతూనే ఉంది. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను కూడా ఏపీ సీఐడీ ప‌ట్ట‌లేక‌పోయింది. ఇప్పుడు నారాయణ రెండో కుమార్తె ఇంటి నుంచి మ‌నీ రూటింగ్(Money rooting) జ‌రిగింద‌ని చెబుతోంది. వివేకా హ‌త్య కేసును సీబీఐ వేగంగా విచార‌ణ జ‌రిగే కొద్దీ ఏపీ సీఐడీ ఇలాంటి బోలోడు అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తుంద‌ని టీడీపీ భావిస్తోంది. ఇదంతా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో ఒక భాగంగా ఆడుతోన్న గేమ్ గా విశ్వ‌సిస్తోంది.

Also Read : AP CID : సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం.. జ‌గ‌న్ జేబు సంస్థ‌గా..?