AP Capital : జ‌గ‌న్ కు మ‌రోసారి `అమ‌రావ‌తి` షాక్‌, సుప్రీంలో భంగ‌పాటు!

సుప్రీంకోర్టులో(AP Capital )స‌ర్కార్ కు షాక్ త‌గిలింది.అమ‌రావ‌తి కేసును

  • Written By:
  • Publish Date - March 2, 2023 / 01:59 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు మ‌రోసారి సుప్రీంకోర్టులో(AP Capital )షాక్ త‌గిలింది. అత్య‌వ‌స‌రంగా అమ‌రావ‌తి (Amaravathi) కేసును విచారించాల‌ని కోరిన ప్రభుత్వం త‌ర‌పున న్యాయ‌వాదుల అభ్య‌ర్థనను తోసిబుచ్చింది. రాజ్యాంగ ప‌ర‌మైన ప‌లు అంశాలు ఆ కేసులో ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇటీవ‌ల తెలిపిన మేర‌కు ఈనెల 28వ తేదీన విచార‌ణకు సుప్రీం కోర్టు సిద్ద‌మ‌యింది. అంతేకాదు, ఈ కేసును విచారించ‌డానికి మ‌రిన్ని రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని కూడా. అభిప్రాయ‌ప‌డింది. దీంతో త్వ‌రిత‌గ‌తిన అమ‌రావ‌తి కేసును తేల్చాల‌న్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉత్సాహం నీరుగారిన‌ట్టు అయింది.

ఏపీ స‌ర్కార్ కు మ‌రోసారి సుప్రీంకోర్టులో షాక్(AP Capital )

ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 28న విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అమరావతి (Amaravathi) కేసులో అనేక రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ అభిప్రాయపడ్డారు. ఈ కేసును 28వ తేదీ ఒక్కరోజు విచారిస్తే సరిపోదని, 29, 30 తేదీల్లో కూడా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. అయితే బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చే కేసులపై విచారణ జరపరాదని పేర్కొంటూ సీజేఐ జారీ చేసిన సర్క్యులర్‌ను ధర్మాసనం వారికి గుర్తు చేసింది. సీజేఐ ధర్మాసనం ప్రత్యేక సూచన చేయాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించ‌డం గ‌మ‌నార్హం.

ప్రభుత్వం విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించ‌డంతో..

Also Read : AP Capital : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి, తేల్చేసిన కేంద్రం!

ఏపీ రాజధాని(AP Capital) అమరావతికి సంబంధించిన కేసుల విషయంలో విచారణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డైల‌మాలో ప‌డ్డారు. గతంలో చెప్పినట్లుగానే ఈ నెల 28వ తేదీనే అమరావతిపై(Amaravathi) దాఖలైన పిటిషన్ల విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చిచెప్పింది. రాజ్యాంగపరమైన అంశాలతో కూడిన‌ ఈ కేసు చాలా పెద్దదని, విచారణ చేపడితే దానికి సార్థకత ఉండాలని వ్యాఖ్యానించారు.

Also Read : Amaravati: అమరావతికి సుప్రీం ముహూర్తం! అసెంబ్లీలో ‘మూడు’ లేనట్టే!

అమరావతికి (Amaravathi) అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో స‌వాల్ చేసిన విష‌యం విదిత‌మే. ఆ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై విచారణ నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. అయితే త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గత సోమవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తాజాగా ఈ రోజు మరోసారి అభ్యర్థించగా సుప్రీం నిరాకరించింది.

Also Read : AP Capital : ప్ర‌పంచ టాప్ -6 న‌గ‌రాల్లో అమ‌రావ‌తి,`మేగ‌జైన్` చెప్పిన నిజాలు