అమరావతి రాజధానికి(AP Capital) భూములు ఇచ్చిన వాళ్లు మాజీ సీఎం చంద్రబాబునాయుడు సామాజికవర్గం అంటూ వైసీపీ దుమ్మెత్తిపోసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చారని ప్రచారం చేసింది. అసెంబ్లీ బయట, లోపల భూములు ఇచ్చిన వాళ్ల జాబితాను టీడీపీ(TDP) బయట పెట్టింది. కమ్మ సామాజికవర్గం కంటే ఎస్సీ, బీసీలు ఎక్కువగా ఉన్నారని తేలింది. ఆ తరువాత ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ నిరాధార ఆరోపణలను చేస్తూ ఏపీ సీఐడీని రంగంలోకి దింపారు. నాలుగేళ్లు అవుతున్నప్పటికీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ తేల్చలేకపోయింది.
ఆర్ -5 జోన్ పై ఉద్యమానికి (AP Capital)
మూడేళ్లుగా అమరావతి(AP Capital) ఉద్యమం చేస్తున్న వాళ్లు కూడా కమ్మ సామాజికవర్గం పెయిడ్ బ్యాచ్ అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రచారం చేసింది. ఎప్పటికప్పుడు పోలీసులు ఉక్కుపాదం మోపినప్పటికీ రైతులు ఉద్యమాన్ని వీడలేదు. వాళ్లను గత రెండేళ్లుగా కొలకలపూడి శ్రీనివాస్ (Kolikalapudi Srinivas)ముందుండి నడిపిస్తున్నారు. ఆయన ఎస్సీ సామాజికవర్గం. అంతేకాదు, న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్(Jada Sravan) అమరావతి రాజధాని కోసం క్షేత్రస్థాయి పోరాటానికి దిగారు. ఆయన కూడా ఎస్సీ సామాజికవర్గం. అటు కొలకలపూడి ఇటు జడ అమరావతి ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నారు. సివిల్స్ కోచింగ్ సెంటర్ ను నిర్వహించుకుంటోన్న శ్రీనివాస్ గత రెండేళ్లుగా పూర్తి స్థాయిలో అమరావతి కోసం పోరాడుతున్నారు. ఇక న్యాయవాది శ్రవణ్ ఎప్పటికప్పుడు మీడియా వేదికగా అమరావతి వాయిస్ ను బలంగా వినింపించారు.
తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపు
అమరావతి (AP Capital ) రైతులకు మాత్రమే కాదు, రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై ఎస్సీ నాయకులుగా ఇద్దరూ గళం విప్పారు. ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఇప్పుడు వైసీపీ ఏ సామాజికవర్గం ఉద్యమం చేస్తుందని చెబుతుంది? ఆర్ -5 జోన్ పై వాళ్లిద్దరూ ఉద్యమానికి పూనుకున్నారు. సింగపూర్ కన్సార్టియంతో సీఆర్డీయే చేసుకున్న ఒప్పందం కనుమరుగు అవుతుందని ఆందోళనకు బాట పట్టారు. ఫలితంగా తుళ్లూరులో(Thulluru) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్-5 జోన్ కు వ్యతిరేకంగా జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపునిచ్చారు. దీక్షకు వచ్చిన శ్రవణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం
ఆర్-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులో తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన చేపట్టారు. ఇదే టైంలోనే వైస్సార్సీపీ మద్దతు దారులు ఆర్-5 జోన్‌లో ఇళ్లు కేటాయింపును సమర్ధిస్తూ కృతజ్ఞత ర్యాలీకి దిగారు. ఇరువర్గాల ర్యాలీలతో పరిస్థితి అదుపు తప్పుతుందని తుళ్లూరులో 144 సెక్షన్ పెట్టారు. నిరసనలు, ర్యాలీలు, దీక్షలను నిషేదిస్తూ పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దీంతో వాళ్లకు సంఘీభావంగా రైతులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అరెస్టు చేసి వాహనాల్లో తుళ్ళూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Also Read : ‘R5’ riot in Amaravati: అమరావతిలో ‘ఆర్ 5’ అలజడి
పోలీసుల ఆంక్షల నడుమ తుళ్లూరులో ఆర్-5 మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో రైతులు నిరసనకు దిగారు. నిరసనకు వచ్చిన రైతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, వృద్ధులను బలవంతంగా నిరసన వేదిక నుంచి పోలీసులు తరలించారు. వారిలో హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీం భారత్(Jai Bheem Bharat) పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు. నిరసన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేదిక ప్రాంతంలోకి ఎవరూ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Also Read : AP Capital : జగన్నాటకంలో అమరావతి
దళిత, మహిళా రైతులు పెద్ద ఎత్తున ఈ దీక్షకు తరలి వచ్చారు. ఇటీవల దాకా ఒక సామాజికవర్గానికి చెందిన రాజధానిగా (AP Capital) చెబుతూ వచ్చిన వైసీపీ కళ్లు తెరిపించేలా నిరసనదీక్షకు వివిధ సామాజికవర్గాలు హాజరు కావడం గమనార్హం. ప్రత్యేకించి కొలకలపూడి, జడ శ్రావణ్ లీడ్ చేయడంతో అమరావతి ఉద్యమం మరో మైలురాయికి చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే మహాపాదయాత్రను ముందుండి నడిపించిన శ్రీనివాస్, దాన్ని హైలెట్ చేసేలా మీడియాలో గళం వినిపించిన జడ ఉద్యమాలను చూస్తున్నాం. ఇప్పుడు ఆర్ 5 జోన్ వ్యవహారంపై ఇద్దరూ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లడానికి సిద్దమయ్యారు. ఈ ఉద్యమంలో ఎస్సీలు ఎక్కువగా ఉండడం గమనార్హం.
Also Read : Amaravathi Farmers : అమరావతి రైతుల `త్యాగం`కు జగన్ గొళ్లెం!