AP Capital : కేసీఆర్ క‌ళ్ల‌లో ఆనందం కోసం జ‌గ‌న్ ! అమ‌రావ‌తి కూల్చివేత‌!!

తెలంగాణ సీఎం కేసీఆర్ క‌ళ్ల‌లో శాశ్వ‌త ఆనందం ఇచ్చేలా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తి ప్రాజెక్టును(AP Capital)కూల్చేశారు.

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 02:25 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ క‌ళ్ల‌లో శాశ్వ‌త ఆనందం ఇచ్చేలా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తి ప్రాజెక్టును(AP Capital)కూల్చేశారు. భ‌విష్య‌త్ లోనూ సీఆర్డీయే చ‌ట్టం ప్ర‌కారం అభివృద్ధి చేయ‌డానికి లేకుండా చ‌ర్యలు తీసుకున్నారు. దీంతో హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భూముల ధ‌ర‌లు మ‌రింత పెర‌గ‌డానికి అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే భూముల ధ‌ర‌ల‌ను చూపుతూ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న కేసీఆర్ కు అమ‌రావ‌తిలోని తాజా ప‌రిణామం మ‌రింత ఊపునివ్వ‌నుంది.

  కేసీఆర్  క‌ళ్ల‌లో శాశ్వ‌త ఆనందం ఇచ్చేలా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తి ప్రాజెక్టును(AP Capital)

హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఆర్ -5 జోన్ మీద విచార‌ణ‌లు (AP Capital) పెండింగ్ లో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తి ప్రాంతంలో సెంటు భూమి లెక్క‌న సీఆర్డీయే ప‌రిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్ లలో 50,793 మందికి కేటాయించారు. ఆ భూమి విలువ‌ను 1,371.41 కోట్లగా నిర్థారిస్తూ పేద‌ల మ‌న్న‌న‌లు పొంద‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎత్తుగ‌డ వేశారు. అక్క‌డ టిట్కో ఇళ్ల‌ను నిర్మించ‌డానికి సోమ‌వారం శంకుస్థాన చేశారు. ఆ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భకు వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై నిర‌స‌న వ్యక్తం చేస్తూ రైతులు న‌ల్ల‌బెలూన్ల‌ను ఎగుర‌వేశారు. పోలీసుల భారీ ప‌హారా మ‌ధ్య స‌భ‌ను నిర్వ‌హించారు. రైతుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అరెస్ట్ చేసిన క్ర‌మంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌భ‌ను ముగించారు.

అమ‌రావ‌తి ప్రాజెక్టు కుప్ప‌కూలిన త‌రువాత హైద‌రాబాద్ లో భూముల ధ‌ర‌లు

అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా రైతులు స్వ‌చ్చంధంగా ఇచ్చిన భూముల‌ను పేద‌ల పేరుతో ఇత‌రుల‌కు ఇవ్వ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగం. మ‌రో వైపు కేసీఆర్ కు స‌హ‌క‌రించ‌డానికి తీసుకున్న చ‌ర్య‌గా ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. అసెంబ్లీ బ‌య‌ట‌, లోప‌ల ప‌లు సంద‌ర్భాల్లో ఏపీలో ప‌డిపోయిన భూముల ధ‌ర‌ల గురించి కేసీఆర్ మాట్లాడారు. అమ‌రావ‌తి ప్రాజెక్టు కుప్ప‌కూలిన త‌రువాత హైద‌రాబాద్ లో భూముల ధ‌ర‌లు పెరిగిన అంశాన్ని కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ కూడా ప‌లు సంద‌ర్బాల్లో గుర్తు చేశారు. తెలంగాణ లీడ‌ర్లు ఎంత‌గా విమ‌ర్శిస్తున్న‌ప్ప‌టికీ అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం (AP Capital) జ‌రుగుతుంద‌ని కొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌లు ఇప్ప‌టికీ విశ్వ‌సించే వాళ్లు లేక‌పోలేదు.

హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ ప‌డిపోయింది

అమ‌రావ‌తి ప్రాజెక్టు మీద ఇంకా కొంద‌రు పెట్టుబ‌డిదారుల‌కు న‌మ్మ‌కం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రాక‌పోతే, చంద్ర‌బాబు తిరిగి రాజ‌ధాని నిర్మాణం చేప‌డ‌తార‌ని విశ్వ‌సిస్తున్నారు. అందుకే, ఇటీవ‌ల హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ ప‌డిపోయింది. జీవో 111 ను తొల‌గించిన‌ప్ప‌టికీ అక్క‌డున్న సుమారు 1.80ల‌క్ష‌ల ఎక‌రాల్లో రియ‌ల్ ఎస్టేట్ ఊపందుకోలేదు. ఇటీవ‌ల హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల హెచ్ ఎం డీఏ వేసిన భూముల వేలంలోనూ స్పంద‌న క‌రువైయింది. కొన్ని ప్రాంతాల్లో టెండ‌ర్లు కూడా ఎవ‌రూ వేయ‌లేదు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తోన్న పెట్టుబ‌డిదారులు, పారిశ్రామివేత్త‌లు దూకుడుగా హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల భూముల‌ను కొనుగోలు చేయ‌డంలేదు. పెరిగిన ధ‌ర‌లు ఒక వైపు అమ‌రావ‌తి ప్రాజెక్టు.(AP Capital) మీద కొన‌సాగుతోన్న సందిగ్ధ‌త మ‌రో వైపు వాళ్ల‌ను ఆలోచింప చేస్తోంది.

Also Read : Amravathi : అమ‌రావ‌తిపై కుట్ర‌కోణం, కేటీఆర్ మాట‌ల్లో..!

అమ‌రావ‌తి ప్రాజెక్టు మీద ఇప్ప‌టికీ ఆశ‌లు పెట్టుకున్న పారిశ్రామిక‌వేత్త‌లు, పెట్టుబ‌డిదారుల అభిప్రాయాన్ని శాశ్వ‌తంగా తొల‌గించేలా 50వేల‌కు పైగా టిట్కో ఇళ్ల‌ను అమ‌రావతిలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. అంటే, చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సీఆర్డీయే ఒప్పందం ప్ర‌కారం భ‌విష్య‌త్ లోనూ రాజ‌ధాని నిర్మాణం ఉండ‌ద‌ని సంకేతాలు ఇచ్చేశారు. ఇలాంటి ప‌రిణామం కేసీఆర్ కు కావాలి. అంతేకాదు, జగ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా లాభం పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే, ఆయ‌న ఆస్తుల‌న్నీ హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. అంతేకాదు, వైసీపీలోని కీల‌క లీడ‌ర్ల ఆస్తులు, ఏపీలోని ఆదాయాన్ని తెలంగాణ‌కు త‌ర‌లించిన వాళ్లు అనేకులు. రెండు రాష్ట్రాల సీఎంలు క్విడ్ ప్రో కో లెక్క‌న అమ‌రావతి ప్రాజెక్టును `సెంటు`భూమి పేరుతో శాశ్వ‌తంగా నిర్మూలించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఏపీలోని ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌.

Also Read : AP Capital : అమ‌రావ‌తిని రాజ‌ధానిగా గుర్తించిన కేంద్రం