Site icon HashtagU Telugu

Amaravati : రాజధాని అమరావతిలో ఇంటింటికి పైప్‌లైన్‌‌తో గ్యాస్‌

Piped Gas To Ap Capital Amaravati Indian Oil Corporation

Amaravati : ఏపీ రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్. పూర్తి స్థాయిలో పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌‌ను వినియోగించే దేశంలోనే తొలి రాష్ట్ర రాజధానిగా అమరావతి మారనుంది. ఈ దిశగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ఒక ప్రతిపాదన చేసింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రం పరిధిలో పైప్‌లైన్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే, పరిష్కారానికి సహకరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Also Read :New Revenue Act : ఇవాళ అసెంబ్లీలోకి ‘కొత్త రెవెన్యూ చట్టం’ బిల్లు.. కీలక అంశాలివీ

పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) సభ్యుడు రమణకుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రోజు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌తో సమావేశమైంది. అనంతరం ఏపీ గ్యాస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌‌తోనూ భేటీ అయింది. గ్యాస్ పైప్ లైన్ ద్వారా అమరావతిలోని 80 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళికను రెడీ చేస్తున్నట్లు తెలిసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లాలో గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌-టెక్‌ (గిఫ్ట్‌) సిటీ ఉంది. అక్కడ గ్యాస్, విద్యుత్, టెలికాం కేబుళ్లు అన్నీ అండర్ గ్రౌండ్‌లోనే ఉన్నాయి. అక్కడ ప్రతీ ఇంటికీ పైప్‌లైన్‌ ద్వారానే గ్యాస్‌ సప్లై అవుతోంది. అదే నమూనాను అమరావతి(Amaravati)లో అమలు చేయాలని టీడీపీ సర్కారు యోచిస్తోంది.

Also Read :Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే స‌మ‌స్య‌లే!

గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఇంకా ఏమున్నాయ్ ?

గుజరాత్‌లోని ‘గిఫ్ట్ సిటీ’ అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల మధ్య ఉంది. ఈ నగరంలో ప్రధానంగా బ్యాంకులు, క్యాపిటల్ మార్కెట్ కంపెనీలు, బీమా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. 142 స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లు కూడా అక్కడ ఏర్పాటయ్యాయి. ప్రతిరోజూ ఆ సెజ్‌లు సగటున రూ.32వేల కోట్ల టర్నోవర్‌ను చేస్తుంటాయి. ప్రఖ్యాత బ్యాంకులన్నింటికీ ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి. ఈ సిటీలోనే స్కూళ్లు, హాస్పిటళ్లు, బిజినెస్ క్లబ్స్, హోటల్స్ సైతం ఉన్నాయి. ఇక్కడ వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ రింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.