AP Cabinet Meeting: రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, భూ కేటాయింపులు, చట్ట సవరణలు వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ ఉంటుంది.
కీలక చర్చలు, నిర్ణయాలు
మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకంపై కేబినెట్ చర్చించనుంది. ఈ పథకానికి సంబంధించి అధికారికంగా పేరును ఖరారు చేసి, ఆగస్టు 15 నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు సైతం వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం కానుందా? లేక రాష్ట్రమంతటా అమలు చేయనున్నారా అనేది రేపు తెలియనుంది.
సీఎం సింగపూర్ పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బృందం సింగపూర్ పర్యటనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు
కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో తాజాగా జరిగిన లిక్కర్ కేసులు, నగదు బయటపడడం, అరెస్టుల వంటి అంశాలపై చర్చ జరిపే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.