Site icon HashtagU Telugu

AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

Ap Cabinet

Ap Cabinet

నేడు ఏపీ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తుంది. అసెంబ్లీ స‌మావేశాలు..CPS అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే GPS అమలుపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి GO లను సైతం అధికారులు సిద్ధం చేశారు. కేబినెట్‌ భేటీలో లాంఛనంగా ఆమోదించే అవకాశముంది కేబినెట్‌ అనంతరం మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో భేటీకానుంది. జీపీఎస్‌కు అంగీకరించాల్సిందేనని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం కేసులు నమోదు చేయించింది. కేసులను తొలగించాలని పదేపదే CPS సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కేసులను అడ్డుపెట్టి GPS కు ఒప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఆరోపిస్తున్నారు.