Site icon HashtagU Telugu

AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాలు, ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

Cm YS Jagan

Ap Cm Jagan

నేడు(బుధ‌వారం) ఏపీ మంత్ర‌వ‌ర్గ స‌మావేశం(కేబినెట్‌) జ‌ర‌గ‌నుంది. సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు కేబినెట్ మీటింగ్ ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. రేపటి (గురురవారం) నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల పని దినాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. ప రేప‌టి నుంచి ఏపీ శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఐదు రోజులపాటు శాసన సభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి సమావేశాలను మరో రెండు రోజులు పెంచే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇటు ప్ర‌తిప‌క్షనేత చంద్ర‌బాబునాయుడు అరెస్ట్ కావ‌డంతో స‌మావేశాలు హాట్‌హాట్‌గా సాగే అవ‌కాశం ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం గ‌త ప్రభుత్వం చేసిన అవినీతిపై స‌మావేశాల్లో మాట్లాడే అవ‌కాశం ఉంది.