Site icon HashtagU Telugu

CM Jagan: రూ. 1.26ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులకు జ‌గ‌న్ క్యాబినెట్ ఆమోదం

cm jagan

ఏపీ క్యాబినెట్ 57 అంశాల‌పై కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ప్ర‌ధానంగా ఏపీకి 1.26ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల రాబ‌ట్టేందుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం జ‌రిగింది. మంత్రివర్గ సమావేశంలో 57 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంది.

1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీలో 81,000 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 21,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వికలాంగ విద్యార్థులకు ఉద్యోగాలు, ప్రమోషన్లలో నాలుగు శాతం రిజర్వేషన్లు, వైఎస్ఆర్ చేయూత, భావనపాడు పోర్టు విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15 నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Exit mobile version