ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) జూలై 9న నిర్వహించనున్నారు. ఈ సమావేశం అమరావతిలోని వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్‌లో జరుగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలకూ జూలై 7లోపు చర్చించాల్సిన అంశాలను పంపించాలంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) డా. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
Big Beautiful Bill : ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ పై ట్రంప్ సంతకం..వైట్‌హౌస్‌లో సంబరాలు
ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం, అమరావతి అభివృద్ధి పనులు, పోలవరం ప్రాజెక్ట్ పురోగతి వంటి ప్రధానమైన అంశాలు ప్రాధాన్యతగా ఉంటాయని తెలుస్తోంది. రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేయడం ద్వారా, రాబోయే కాలానికీ సుస్థిర వ్యూహాలను రూపొందించే అవకాశం ఉంది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల ఆమోదం, నూతన పనులకు మంజూరైన అంచనాలు వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది.
New District in AP : ఏపీలో మరో కొత్త జిల్లా
అంతేగాక విశాఖపట్నంలో ఐటీ కంపెనీల ఏర్పాటు, పారిశ్రామికవికాసం, యువతకు ఉపాధి అవకాశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించే అవకాశముంది. నూతన పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన, వనరుల వినియోగంపై దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం తన పాలనలో స్పష్టత తీసుకొచ్చేలా, ప్రజల అభివృద్ధికి దిశానిర్దేశం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.