Site icon HashtagU Telugu

Cabinet meeting : ఏప్రిల్‌ 3న ఏపీ క్యాబినెట్‌ భేటీ

AP Cabinet meeting on April 3

AP Cabinet meeting on April 3

Cabinet meeting : ఏపీ మంత్రి వర్గ సమావేశం ఏప్రిల్ 3వ తేదీన జరగనుంది. ప్రతి నెల రెండుసార్లు మంత్రి వర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో మూడో తేదీన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈనెల 27వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నారు.

Read Also: BJP MLAs : 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలలు సస్పెన్షన్ వేటు

ఈ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. వ్యవసాయ రంగం, విద్య, ఆరోగ్య రంగాలకు కొత్త నిధుల కేటాయింపుపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇక, ఈ సమీక్షలో ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌ వినియోగం, కొత్త పథకాల అమలు విధానాలపై అధికారులు ప్రాధాన్యతనివ్వనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. అదనంగా, ప్రభుత్వ ఖర్చులను తగ్గించే చర్యలు, వృథా వ్యయాల నియంత్రణపై ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.

Read Also: Viveka Murder case : వివేకా హత్య కేసు.. హైకోర్టులో సునీత పిటిషన్‌