ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు (AP Cabinet Meeting) నాయకత్వంలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా సీఆర్డీయే ఆధ్వర్యంలో అమలు చేయనున్న ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సీఆర్డీయే ద్వారా 22,607 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 22 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది. అలాగే మున్సిపల్ శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం , అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15,081 కోట్ల విలువైన 37 పనులకు కూడా మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది.
Telugu University : పొట్టి శ్రీరామలు పేరును తొలగించడం పై బండి సంజయ్ ఫైర్
రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించే దిశగా ఈ సమావేశం(AP Cabinet Meeting)లో అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తం 10 ప్రధాన సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ.1,21,659 కోట్ల పెట్టుబడులు రావడానికి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. నెల్లూరు, కడప, విశాఖపట్నం, శ్రీసిటీలో భారీ పెట్టుబడుల కోసం అనేక కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, దాల్మియా సిమెంట్, లులూ గ్లోబల్, ఇండోసాల్ సోలార్ లాంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రాగా, వాటికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ పెట్టుబడుల ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఏపీ కేబినెట్ (AP Cabinet Meeting) రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడానికి, 26 జిల్లాల్లో వాటిని మొదటిస్థాయిలో ప్రారంభించేందుకు అంగీకారం తెలిపింది. అలాగే రతన్ టాటా గ్రూప్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఇన్నోవేషన్ కేంద్రాలను నెలరోజుల్లో ఏర్పాటు చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. ఓవరాల్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.