AP Cabinet Meeting Highlights : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 07:20 PM IST

ఏపీ సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ (AP Cabinet) భేటీ జరిగింది. ఈ భేటీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్య శ్రీలో (Arogya Sri) చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం .. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు .. ‘మిగ్ జాం’ తుపాను నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అలాగే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం .. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభం కానున్నట్లు మంత్రివర్గం వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే కేబినెట్ (AP Cabinet Meeting Highlights) తీసుకున్న పలు కీల‌క నిర్ణ‌యాలు చూస్తే..

  • ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ
  • ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కెబినెట్ నిర్ణయం
  • సామాజిక పెన్షన్‌లను రూ. 2,750 నుంచి రూ. 3,000 వేలకు పెంపునకు కేబినెట్‌ ఆమోదం
  • వైయ‌స్ఆర్ ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగామన కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశం
  • 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు
  • విశాఖలో లైట్‌మెట్రో రేల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం
  • వైద్యారోగ్య రంగంలో వివిధ స్ఖాయిల్లో పోస్టుల భర్తికీ కెబినెట్ ఆమోదం
  • ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయం.
  • శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స
  • ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేయడం
  • ఆరోగ్యశ్రీ అవగాహన.. ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని నిర్ణయం
  • ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణ ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
  • ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరీ చేయడం.
  • జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్‌ ఆమోదం
  • కుల, ఆదాయ ధ్రువీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్‌ ఆమోదం
  • కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు గ్రామ సచివాలయంలో పొందవచ్చు
  • 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ
  • కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్‌ చెల్లింపుకు నిర్ణయం
  • పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఈ నెల 21న సీఎం వైయ‌స్ జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా పంపిణీకి నిర్ణయం.
  • జనవరి 10 నుంచి 23 వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం.
  • 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆర్ధిక సహాయం చేయడానికి కేబినెట్ ఆమోదం
  • ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కెబినెట్ నిర్ణయం
  • ఇకపై ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం మెరిటైం బోర్డు పరిధిలోకి తెస్తూ కెబినెట్ నిర్ణయం
  • యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌లో పనిచేసే టీమ్స్‌కు 15శాతం అలవెన్స్‌ పెంపుకు నిర్ణయం
  • 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేషన్‌
  • ఆడుదాం ఆంధ్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంబటి రాయుడు కు నిర్ణయం
  • కేబినెట్‌ సబ్‌కమిటీ, స్టీరింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం

Read Also : Praja Bhavan Inside Video : రాజ్ మహల్ ను తలదన్నేలా ప్రజాభవన్..అబ్బా ఏమన్నా ఉందా ..!!