Site icon HashtagU Telugu

AP Cabinet : కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ..కీలక హామీలకు ఆమోదం

Apcabinet

Apcabinet

సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన నేడు తొలి మంత్రివర్గ సమావేశం (AP Cabinet) కొనసాగుతుంది. ఈ సమావేశంలో కూటమి ప్రకటించిన కీలక హామీల అమలుకు ఆమోదం పలకనున్నారు. మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, పింఛన్‌ రూ. 4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అదే విధంగా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్య అంశాల గురించి మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం, కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఈ సమావేశంలో వాగ్దానాల అమలు, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎనిమిది శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె.. ‘చంద్రన్న బీమా’ పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మిక శాఖ లో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చు అని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందుతుంది.

Read Also : Sensex Today: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్