AP Cabinet : ఉద్యోగుల‌కు జ‌గ‌న్ క్యాబినెట్ వ‌రాలు! ఇక ఉద్య‌మాలు లేన‌ట్టే.!!

ఉద్యోగుల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ (AP Cabinet) శాంత‌ప‌రిచింది. 12వ పీఆర్సీకి ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం చేసింది.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 03:24 PM IST

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ (AP Cabinet) శాంత‌ప‌రిచింది. వాళ్ల‌కు కావాల్సిన ప్ర‌ధాన డిమాండ్ 12వ పీఆర్సీకి ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇక సీపీఎస్ బ‌దులుగా జీపీఎస్ ను అమ‌లు చేయ‌డానికి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫ‌లితంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వానికి , ఉద్యోగుల‌కు మ‌ధ్య జ‌రుగుతోన్న అంతర్గ‌త వార్ దాదాపుగా ముగిసింది. క్ర‌మంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) స‌ర్కార్ ఉద్యోగుల‌కు కోర్కెల‌ను తీర్చుతుంద‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

12వ పీఆర్సీకి ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ తీర్మానం (AP Cabinet)

ప‌లు విడ‌త‌లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకంగా ప‌నిచేశాయి. కొన్ని సంఘాల మీద వేటు వేయ‌డానికి స‌ర్కార్ సిద్ద‌మ‌యింది. జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం ఉందంటూ గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాన్ని ర‌ద్దు చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సాహ‌సం చేశారు. దాని మీద ప్ర‌స్తుతం విచార‌ణ కూడా జ‌రుగుతోంది. రాజ‌కీయ పార్టీల వారీగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు కూడా విడిపోయారు. అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ జేఏసీ విడ‌త‌ల‌వారీ ఆందోళ‌న‌కు దిగింది. ఇప్పుడు ఆందోళ‌న‌ను విర‌మించేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ (AP Cabinet)తీర్మానాల‌ను చేసింది.

ఆందోళ‌న‌ను విర‌మించేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్

తొలి నుంచి ఉద్యోగ సంఘాల నాయ‌కులు శ్రీనివాసరావు, సూర్యనారాయ‌ణ‌ల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. మ‌రో నాయ‌కుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు మ‌ధ్యేమార్గంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఆందోళ‌న కొన‌సాగించారు. తొలి రోజుల్లోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ (Jaganamohan Reddy) న్యాయం చేస్తుంద‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కునిగా శ్రీనివాస‌రావు వాయిస్ వినిపించారు.కానీ, సూర్య‌నారాయ‌ణ మాత్రం టీడీపీ ప‌క్షాన నిలిచార‌ని విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. ఆయ‌న సంఘాన్ని కూడా ర‌ద్దు చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. దానిపై న్యాయ‌స్థానాల్లో కేసులు ప్ర‌స్తుతం న‌డుస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో బుధ‌వారం స‌మావేశ‌మైన క్యాబినెట్ కీల‌క నిర్ణ‌యాల‌ను (AP Cabinet) తీసుకుంటూ ఉద్యోగుల‌ను సంతృప్తి ప‌రిచ‌డంతో ఇక ఆందోళ‌న బాట ను విర‌మించిన‌ట్టే క‌నిపిస్తోంది.

Also Read : AP Employees : ఏపీ ఉద్యోగ సంఘం విజ‌యం! `సుప్రీం` దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ !

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివ‌ర్గ స‌మావేశం 63 అంశాలకు ఆమోదం తెలిపింది. వాటిలో 12వ పీఆర్సీ నియామకం, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ త‌దిత‌ర ప్ర‌ధానమైన తీర్మానాలు ఉండ‌డం విశేషం. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు కేబినెట్లో నిర్ణయించారు. ఆ మేర‌కు ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూప‌క‌ల్ప‌న చేస్తూ కేబినెట్ (AP Cabinet)ఆమోదం తెలిపింది.

అమ్మఒడి పథకం అమలు, విద్యా కానుక పంపిణీ, జగనన్న ఆణిముత్యాలు పథకం అమలు, రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల్లో 706 పోస్టుల భర్తీ, చిత్తూరు డెయిరీ ప్లాంట్ కు 28 ఎకరాల భూమిని లీజు ప్రతిపాదనకు, ఏపీ పౌరసరఫరాల కార్పోరేషన్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఎంవోయులు కుదుర్చుకున్న సంస్థలకు భూకేటాయింపు… ఇలా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం(AP Cabinet) తెలిపింది. రాబోవు రోజుల్లో పాల‌న వేగ‌వంతం చేసేలా కీల‌క నిర్ణ‌యాల‌ను క్యాబినెట్ తీసుకుంది.

Also Read : AP Employees: ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్.. సంక్రాంతికి ‘డీఏ’