AP Cabinet : వైఎస్ డ్రీమ్ ప్రాజెక్టు సాకారానికి జ‌గ‌న్.. మ‌ళ్లీ తెర‌పైకి వాన్ పిక్ ? డీపీఆర్ ల‌కు క్యాబినెట్ తీర్మానం

మ‌ళ్లీ వాన్ పిక్ ప్రాజెక్టును జ‌‌గ‌న్ స‌ర్కార్ తెర‌మీద‌కు తీసుకురాబోతుందా? స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు వాన్ పిక్ సాకారం అవుతుందా? ఏపీలోని తీరం వెంబ‌డి ఓడ‌రేవుల‌కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారంటే...వాన్ పిక్ ప‌థ‌కం క్ర‌మంగా ఆవిష్కృతం అవుతుందా?

  • Written By:
  • Updated On - October 28, 2021 / 05:23 PM IST

మ‌ళ్లీ వాన్ పిక్ ప్రాజెక్టును జ‌‌గ‌న్ స‌ర్కార్ తెర‌మీద‌కు తీసుకురాబోతుందా? స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు వాన్ పిక్ సాకారం అవుతుందా? ఏపీలోని తీరం వెంబ‌డి ఓడ‌రేవుల‌కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారంటే…వాన్ పిక్ ప‌థ‌కం క్ర‌మంగా ఆవిష్కృతం అవుతుందా? ఇలాంటి సందేహాలు రావ‌డం స‌హ‌జం. ఏపీ క్యాబినెట్ స‌మావేశంలో తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల్లో ప్ర‌కాశం జిల్లా ఓడ‌రేవుతో పాటు మ‌రో 5 ఓడ‌రేవుల‌కు డీపీఆర్ లు త‌యారు చేయాల‌ని తీర్మానం జ‌రిగింది. వాస్త‌వంగా వాన్ పిక్ ప్రాజెక్టులోని ప్ర‌ధాన డిజైన్ కోస్తా వెంబ‌డి ఓడరేవుల‌ను నిర్మించ‌డం. వాటి ద్వారా పెద్ద ఎత్తున ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం. ఫ‌లితంగా అభివృద్ధి వేగవంతం అవుతుంద‌ని ఆనాటి వాన్ పిక్ ప్రాజెక్టులోని విజ‌న్. దాన్ని య‌థాత‌దంగా కాకుండా విడ‌త‌వారీగా అమ‌లు చేయాలన్న‌ట్టుగా ఓడ రేవుల‌కు డీపీఆర్ ల‌ను సిద్ధం చేయడానికి జ‌గ‌న్ క్యాబినెట్ తీర్మానం చేసింది.
గంజాయి స్మ‌గ్లింగ్ మీద స‌రైన రీతిలో స్పందింకుండా ఉన్న కొంద‌రు మంత్రుల‌పై జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. క్యాబినెట్లో ఇటీవ‌ల గంజాయి, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై జ‌రిగిన దుమారం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఆ సంద‌ర్భంగా మంత్రుల‌ను మంద‌లించిన‌ట్టు స‌చివాల‌య వ‌ర్గాల టాక్. తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు జ‌రిగిన గంజాయి స్మ‌గ్లింగ్, ప్ర‌స్తుత రెండున్న‌రేళ్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య తేడాను స్ప‌ష్టంగా తెలియ‌చేయాల‌ని అధికారుల‌కు క్యాబినెట్ దిశానిర్దేశం చేసింది. వీటితో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన క్యాబినెట్ చేసిన తీర్మానాలు ఇవి..

  1. స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వ‌ర్యంలోని విశాఖ శారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపు
  2. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్ కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు
  3. ష్ట్రంలో ఐదు చోట్ల సెవెన్ స్టార్ పర్యాటక రిసార్ట్ ల ఏర్పాటుకు భూముల కేటాయింపు
  4. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
  5. జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు
  6. వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  7. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటు
  8. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించేలా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం
  9. ఆన్ లైన్ టిక్కెటింగ్ కోసం సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు ఆమోదం
  10. యూనిట్ రూ. 2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు
  11. బీసీ జనాభాను కులాలవారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం
  12. విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు ఆమోదం
  13. అమ్మ ఒడి ప‌థ‌కానికి 75శాతం హాజ‌రు త‌ప్ప‌నిస‌రి చేస్తూ తీర్మానం