PRC Issue : సమ్మె పై ఊహు..మంత్రివర్గంలో స్కెచ్ ఇదే!!

ఏపీ ఉద్యోగుల దూకుడు వాళ్ళకే ప్రమాదం తెనుందా? అందుకే సమ్మెపై వెనకడుగు వేశారా? న్యాయపోరాటం చేస్తే ..అసలుకే మోసం కానుందా? హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నారు?

  • Written By:
  • Publish Date - January 21, 2022 / 05:19 PM IST

ఏపీ ఉద్యోగుల దూకుడు వాళ్ళకే ప్రమాదం తెనుందా? అందుకే సమ్మెపై వెనకడుగు వేశారా? న్యాయపోరాటం చేస్తే ..అసలుకే మోసం కానుందా? హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నారు? అమరావతి జేఏసీ తో చేతులు కలపడం వెనుక ఏముంది? ఇలాంటి అంశాలపై మంత్రివర్గంలో సీరియస్ చర్చ జరిగిందని తెలుస్తుంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సీ, ప్లాన్ ఢీ వరకు చర్చినట్టు సమాచారం. సమ్మె నోటీస్ నుంచి వెనక్కు ఉద్యోగులు తగ్గారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇవాళ నోటీస్ ఇవ్వాలి. ఫిబ్రవరి 6 నుంచి పూర్తి సమ్మెకు వెళ్ళాలి. కానీ అకస్మాత్తుగా సమ్మె నోటీసులు ఇవ్వడంపై పునరాలోచన చేస్తున్నారు. ఒక వేళ సమ్మె నోటీస్ ఇస్తే తేల్చుకోవడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ విషయాన్ని తెలుసుకొని మంత్రులతో సంప్రదించాలని భావిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రుల కు ఆ భాధ్యతను సీఎం జగన్ అప్పగించాడని టాక్. ఇక ప్లాన్ బీ బయటకు తీస్తే ఎస్మా చట్టం తొలి విడత ప్రయోగించాలని చర్చినట్టు తెలుస్తుంది. అప్పటికీ ప్రభుత్వం మాట వినకుండా ఉద్యోగులు సహాయ నిరాకరణ కొనసాగిస్తే ..ఇతర రాష్ట్రాలు గతంలో చేసిన పనిపై అధ్యయనం చేసి అమలు చేయాలని చేస్తున్నారట. ఇక ప్లాన్ సీ.. హైకోర్టు కు ఉద్యోగులు వెళ్తే మంచిది. లేదా ప్రభుత్వమే పిటిషన్ వేయాలని భావిస్తుంది. సమ్మె నోటీస్ ఇచ్చిన తరువాత కోర్టులో తేల్చుకోవాలని భావిస్తుందట. ఇక చివరిగా.. ప్లాన్ ఢీ.. జగన్ అంటే ఏమిటో చూపించేలా ఉద్యోగుల్ని తొలగించటం .ఇలా గతంలో పలు రాష్ట్రాలు చేశాయి. ఆ పద్దతిపై అధ్యయనం చేసి చివరి అస్త్రాన్ని ప్రయోగించే వరకు చర్చ జరిగిందని వినికిడి. అందుకే , ఉద్యోగులు సమ్మె నోటీస్ నుంచి ఒక అడుగు వెనక్కు వేశారు. వీలున్నంత వరకు సామరస్య పరిష్కారం దిశగా వెళ్లాలని భావిస్తున్నారట. కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక పోగొట్టుకున్నట్టు చేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు తెలివిగా మధ్యేమార్గ పరిష్కారం కోసం వేచి చూస్తున్నారని టాక్. అవినీతి పై వచ్చిన ఫైల్స్ దుమ్ము దులిపి ఉద్యోగుల భరతం పట్టాలని వైసీపీలోని ఒక వర్గం సూచిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే జగన్ ఇచ్చిన 14400 టోల్ ఫ్రీ ,14500 నంబర్లు నుంచి వచ్చిన ఫిర్యాదులు కోకొల్లలు. అవినీతి రహిత పాలన అందిస్తా అని ప్రొమిస్ చేసిన సీఎం జగన్ ఆ లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాడు. దానికి కారణం ఉద్యోగుల చేతి వాటం . అందుకే ఆ టోల్ ఫ్రీ నెంబర్ లకు వచ్చిన సమాచారం ఆధారంగా చర్యలకు దిగాలని పార్టీ క్యాడర్ నుంచి ఒత్తిడి ఉందని వినికిడి. సో..జగన్ వద్ద ఉన్న అస్త్రాలను బేరీజు వేసుకున్న ఉద్యోగులు సైలెంట్ గా ఉండాలని అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పైగా ఉద్యోగ సంఘాల్లో రెండుగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వాళ్ళే బాహాటంగా చెబుతున్నారు. అమరావతి జె ఏసీ తో కలిసి ఉద్యమం లోకి రావటం రాజకీయ రంగు పులుముకుంది. వీటన్నిటీనే పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతానికి మధ్యేమార్గం దిశగా వెళ్లాలని భవిస్తూ సమ్మె నోటీస్ సోమవారంకు వాయిదా వేసుకున్నారు. ఆ లోపు ఏదయినా జరగొచ్చు. వెయిట్ అండ్ సీ!