Site icon HashtagU Telugu

AP Cabinet: అమరావతి అభివృద్ధిపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం బుధవారం

TDP Govt

TDP Govt

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం (జూన్ 5) ఉదయం 11 గంటలకు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ప్రధానంగా జీఏడీ టవర్ (GAD Tower) టెండర్లకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. అలాగే హెచ్‌వోడీ (HOD) నాలుగు టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లకు సైతం ఆమోదం లభించనుంది.

రెండో దశ భూసేకరణపై చర్చ:
అమరావతి పరిధిలో రెండవ దశలో సుమారు 44 వేల ఎకరాల భూమి (land acquisition) సేకరణపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) నిర్మాణానికి 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ (Sports Complex) కోసం 2,500 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ (Smart Industrial Hub) కోసం మరో 2,500 ఎకరాల భూమి కేటాయింపుపై చర్చించి ఆమోదం పొందనున్నారు.

ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అంశాలు:

వివిధ సంస్థలకు భూకేటాయింపుపై నిర్ణయం

‘తల్లికి వందనం’ (Mother’s Tribute) పథకంపై చర్చ

కూటమి ప్రభుత్వం (Coalition Government) ఏడాది పాలనపై సమీక్ష

అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) (జూన్ 21, వైజాగ్‌లో) పై ఏర్పాట్లపై చర్చ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) (జూన్ 5) సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం (Plantation Drive) పై చర్చ

ఇక ఇటీవల జరిగిన 48వ సీఆర్డీఏ (CRDA) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూ, అమరావతి అభివృద్ధికి మరిన్ని భూముల అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేబినెట్ సమావేశంలో ఆ దిశగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.