Site icon HashtagU Telugu

AP Rains : ఏపీకి పొంచిఉన్న మ‌రో గండం.. ఎప్పుడంటే..!

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల నవంబర్ 27 నుంచి అతిభారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం జిల్లాల్లో పడనున్నాయి. అనంతపురం, గుంటూరు-కోస్తా, కృష్ణా-కోస్తాలో భారీ వర్షాలుంటాయి.

ఈ వర్షాల వల్ల వరద ఉదృతి మరింత పెరిగనుంది. అన్ని చెరువులు, నదులు, వాగులు, వంకల్లో వరద నీరు అలాగే ఉంది. ఇక ఈ వర్షం తోడైతే భారీ వరద సంభవించే అవకాశాలున్నాయి. అప్రమత్తంగా ఉండటం మంచిది. మీకు కావాల్సిన సరుకులు, ముఖ్యమైన పనులు ఉంటే ఈ నవంబర్ 26 లోపు పూర్తి చేసుకోండి. వరద నుంచి ఉపసమనం ఉండదు. చిన్న వర్షానికే వరద వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త పడండి.​
తమిళనాడు కంటే మన రాష్ట్రంలోని దక్షిణ భాగాల పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మిగిలిన జిల్లాలు – కర్నూలు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లో మోస్తరు వర్షాలు డిసంబర్ 4/5 దాక మనం చూడొచ్చు.

ఈ మూడు రోజులు మీరు చేయాల్సిన పనులు
మీ చుట్టూ ఉండే అధికారుల నంబర్లు, వారు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలుసుకోండి
వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పడవ అందుబాటులో ఉంచుకోవడం మంచిది
పది రోజుల వరకు సరిపడ్డ సరుకులను తీసుకోవడం ఉత్తమం. మనకు తెలియదు, ఎలా ఉండబోతుందో ఈ వరద సమయంలో
మీకు దూరపు ప్రాంతంలో ఉండే భందువులకు, స్నేహితులకు ఈ విషయం గురించి తెలియజేయండి.
ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం, వరద సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి.