Site icon HashtagU Telugu

AP BJP Chief : టీడీపీ, వైసీపీపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్‌.. ఆ విధానాల వ‌ల్లే..?

Somu Veerraju Imresizer

Somu Veerraju Imresizer

వైసీపీ, టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీని రాజకీయాల కోసం రావణ కాష్టంగా మారుస్తున్నారని.. టీడీపీ, వైసీపీ విధానాల వల్లే నేడు ఎపిలో ఈ పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. అభివృద్ధి చేయలేని పార్టీ లు, అవినీతి పార్టీ లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని.. ఈ రెండు పార్టీలు విశాఖకు, ఉత్తరాంధ్ర కు ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనానికి టీడీపీ, వైసీపీలే కార‌ణ‌మ‌ని.. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా మోడీ సహకరించారన్నారు. జాతీయ రహదారులు, ఐకాన్ బ్రిడ్జి లు, రైల్వే లైన్లు తామే నిర్మించామ‌ని.. విశాఖ లో యాభై వేల కోట్ల అభివృద్ధి చేశామ‌న్నారు. పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి కాకపోవడానికి కూడా ఆ రెండు పార్టీ లే కారణమ‌ని.. అవి చెప్పుకునేందుకు‌ వీలు లేక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని సోము వీర్రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.