BJP Campaign : జగన్ రోడ్లు-నరకానికి దారులు..ప్రచారం షురూ చేసిన బీజేపీ..!!

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై ఇప్పటికే టీడీపీతోపాటు జనసేన కూడా వినూత్న నిరసనలు చేసిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Ap Roads

Ap Roads

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై ఇప్పటికే టీడీపీతోపాటు జనసేన కూడా వినూత్న నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య ప్రారంభమైన జనసేన ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఏపీలో ఆపార్టీతో పొత్తులో కొనసాగుతున్న కమలం పార్టీ కూడా తాజాగా రోడ్ల దుస్థితిపై వెరైటీ ప్రచారం షురూ చేసింది. జనసేన వలే కార్టూన్లతో బీజేపీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

కాగా శుక్రవారం సోషల్ మీడియాలో బీజేపీ ఓ సెటైరికల్ కార్టూన్ ను సంధించింది. జగన్ రోడ్లు-నరకానికి దారులు అంటూ మొదలుపెట్టిన ఈ ప్రచారంలో వైసీపీ ప్రభుత్వ సిత్రాలు-రాష్ట్ర రోడ్లు అంటూ ఓ కార్టున్ను పోస్టు చేసింది. ఈ కార్టూన్ లో విజయవాడకు ఐదు కిలోమీటర్ల దూరంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి…రోడ్డు పక్కన కూర్చుని మద్యం తాగుతున్న వ్యక్తిని ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు. ఆ వ్యక్తి ఆ ఏముంది సర్ …డైరెక్టుగా పైకే అంటూ సమాధానం చెబుతాడు. అంతేకాదు ఈ రోడ్డు ఎక్కడికి పోతుందో తెలియదు కానీ…నీ కారు మాత్రం షెడ్డుకు…నువ్వు ఆసుపత్రికి మాత్రం పక్కా…అంటూ సెటైర్ సంధిస్తాడు.

  Last Updated: 20 Aug 2022, 12:08 AM IST