Site icon HashtagU Telugu

AP BJP: రాష్ట్ర ‘ఆర్ధిక పరిస్థితి’పై శ్వేతపత్రం విడుదల చేయాలి!

Bjp

Bjp

సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని అందుకే పర్మనెంట్ చేయలేదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంటే ఎలా ఆయన ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమం పథకాలకు నిధులు అందిస్తుందని, అయినా జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా బిజెవైఎం ఎపిపిఎస్ఇ కార్యాలయం వద్ద ఆందోళన కు పిలుపు ఇస్తే ఇష్టానుసారంగా అరెస్టు చేశారని, బిజెవైఎం కార్యకర్తలు ఉన్న లాడ్జి యజమానులు పై కేసులు పెడితే బిజెపి సీరియస్ గా పరిగణిస్తుందని సోము వీర్రాజు అన్నారు. బిజెవైఎం నాయకులను గృహ నిర్భందం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఖండించారు.

ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ లలో పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని, సమస్యలపై పోరాడితే అరెస్ట్ లు చేయడం విడ్డూరమని అన్నారు. కోర్టులో దొంగతనం జరగడాన్ని నేను ఇప్పుడే చూస్తున్నానని, నైతికత లేని వాళ్లకు మంత్రి పదవులు జగన్ ఇచ్చారని మండిపడ్డారు. రేషన్ బియ్యాన్ని కృష్ణపట్నం..కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేస్తున్నారని, ఒంగోలు లో సి.ఎం.జగన్ వస్తున్నారని బి.జె.పి.నేతలను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన అన్నారు. బియ్యం కుంభకోణాన్ని వెలికితీసిన బి.జె.పి.నేతలపై కేసులు పెడుతున్నారని, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బి.జె.పి. పోటీ చేస్తుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version